»   » "రా రా..!" వచ్చేస్తున్నాడు.., చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీనే

"రా రా..!" వచ్చేస్తున్నాడు.., చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'రారా'. విజి చరిష్‌ యూనిట్‌ దర్శకత్వంలో విజయ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జూన్ నెల ప్రథమార్ధం లో విడుదల కాబోతోంది. చాలారోజులుగా హీరో పాత్రలకు దూరమైన శ్రీకాంత్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో లీడ్ రోల్ లో కనిపించనున్నాడు.

హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం

హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.

'రా..రా'

'రా..రా'

మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన చిత్రం మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నెలలోనే చిత్రం టీజర్ ను ఓ ప్రముఖ కథానాయకుడు చేతులమీదుగా విడుదల చేయనున్నాము. అలాగే చిత్రం ఆడియో వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, వచ్చే నెలలో చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

చిరంజీవి

చిరంజీవి

మామూలుగా హారర్ సినిమా అనే సరికి చాలా భయాందోళనగా ఉంటుంది. అలా కాకుండా ఇది హాస్యం జోడించిన హారర్ థ్రిల్లర్ ఇది. చిన్న పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇందులో దెయ్యాలు, మనుషులకు చాలా గేమ్స్ కూడా ఉన్నాయట. ఎక్కడైనా సరే దెయ్యాలను చూసి మనుషులు భయ పడతారు, కానీ ఇక్కడ మనుషులను చూసి దెయ్యాలు భయపడే లాంటి సన్నివేశాలు ఉండటం అనేది చాలా తమాషాగా ఉందని ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే చిరంజీవి అన్నారు.

విజి చరిష్ విజన్స్

విజి చరిష్ విజన్స్

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్.

English summary
Tollywood Hero Srikant is Doing a movie Ra Ra is ready to release, ofter a long gap Srikath doing Lead roale inthis Horror Comedy movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu