»   » రామ్ చరణ్ కోసం శ్రీకాంత్‌కు రూ. కోటి ముట్టజెప్పారట!

రామ్ చరణ్ కోసం శ్రీకాంత్‌కు రూ. కోటి ముట్టజెప్పారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత రామ్ చరణ్‌తో పాటు వెంకటేష్‌ను కూడా తీసుకోవాలనుకున్నారు. అయితే పాత్ర నచ్చక పోవడంతో వెంకటేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఆయన స్థానంలో శ్రీకాంత్‌ను తీసుకున్నారు. ఇపుడు ఈ సినిమాకోసం శ్రీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. సాధారణంగా శ్రీకాంత్‌ హీరోగా చేసే సినిమాలకు సైతం మార్కెట్ వ్యాల్యూను బట్టి రెమ్యూనరేషన్ 60 నుండి 70 లక్షలకు మించి ఉండదు. అయితే రామ్ చరణ్ సినిమా కావడంతో శ్రీకాంత్‌కు భారీ మొత్తం ఆఫర్ చేసారని, శ్రీకాంత్ తన కెరీర్లో తొలిసారిగా రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Srikanth remuneration Rs. 1 crore for GAV

రామ్ చరణ్ సినిమాకు ఉండే మార్కెట్ వ్యాల్యూ దృష్ట్యా.... సినిమాలో శ్రీకాంత్ ప్రాత ప్రాధాన్యతను బట్టి ఇంత రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసారట. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ కుటుంబకథా చిత్రంలో కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతోంది. అయితే ఇటీవల రామ్ చరణ్ అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్ నిలిపి వేసారు.

English summary
Srikanth remuneration Rs. 1 crore for Govindudu Andari Vaadele.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu