»   » డైరక్టర్ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు, హీరో శ్రీకాంత్ తప్పు ఎంతవరకూ?

డైరక్టర్ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు, హీరో శ్రీకాంత్ తప్పు ఎంతవరకూ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : వివాదాలు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు కానీ , కొన్ని వివాదాలు చూస్తూంటే అయ్యో అనిపించకమానదు. ముఖ్యంగా క్రియేటివ్ రైట్స్ విషయంలో వివాదాలు ఆత్మహత్యా సదృశ్యమే. తాజాగా శ్రీకాంత్ తో మెంటల్ అనే చిత్రం రూపొందించిన దర్శకుడు కరణం బాబ్జీకు అదే సమస్య ఎదురైంది. తన సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్య చేసుకోవటమే గతి అంటున్నారు.

  వివరాల్లోకి వెళితే...శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ అనే టైటిల్ పై మూవీ రూపొందగా.. పోలీసుల అభ్యంతరాలతో చివరకు ఈ మూవీ మెంటల్ గా పేరు మార్చుకుంది. ఇప్పుడీ చిత్రం డైరెక్టర్ వ్యవహారం వివాదంగా మారింది.

  తొలుక ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు దర్శకుడిగా కరణం పి. బాబ్జీ పేరు పోస్టర్లలో కనిపించింది. టీజర్ లో కూడా ఈ పేరే ఉంది. కానీ ఈ శుక్రవారం థియేటర్లలోకి మెంటల్ వచ్చేసరికి.. డైరెక్టర్ పేరు మారిపోయింది.

  నేమ్ క్రెడిట్స్ లో డైరెక్షన్- బషీద్ అని పడింది. దీంతో ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు దర్శకుడు బాబ్జీ. అయితే సినిమా నిర్మాత కంప్లెయింట్ చేస్తేనే యాక్షన్ తీసుకోగలమని వాళ్లు చెప్పడంతో ఇప్పుడీ దర్శకుడు న్యాయం కోసం పోరాడుతానంటున్నాడు.

  మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో ...

  ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాను

  ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాను

  తను స్వయంగా 5లక్షలకు పైగా ఇన్వెస్ట్ మెంట్ తోపాటు.. ఏడాదిన్నర కష్టపడ్డానని చెప్పిన బాబ్జీ.. హీరో శ్రీకాంత్ ని కూడా అప్రోచ్ అయినా ఫలితం దక్కలేదని చెబుతున్నాడు. ఈ విషయమై తాను పోరాడటానికి సిద్దమే అంటున్నారు. తన డబ్బు పెట్టుబడి పెట్టడంతో పాటు, కష్టపడ్డ తనకు ప్రతిఫలం దక్కటం లేదనే బాధలో సమంజసం ఉంది.

  నిర్మాత ఇంటిముందే

  నిర్మాత ఇంటిముందే

  మెంటల్ సినిమా క్రెడిట్స్ లో తన పేరు పడకపోతే బషీద్ ఇంటి ముందు సూసైడ్ చేసుకుంటానని చెబుతున్నాడు. అయితే.. ఇప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీకి ఇంత హంగామా అవసరమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే క్రియేటివ్ రైట్స్ అనేవి ఎప్పుడూ గొప్పవే. హిట్ అయినా , ఫ్లాఫ్ అయినా ఎవరి బిడ్డ వారికి ముద్దే.

  ఇందులో న్యాయం ఉందా

  ఇందులో న్యాయం ఉందా

  ‘‘సినిమాను కొన్నవాళ్లు అయితే నిర్మాతలు అవుతారు. కాకపోతే సమర్పకులు అవుతారు. అంతేగానీ దర్శకులవుతారా? ఒక సినిమాను కొనుక్కున్నంత మాత్రాన ‘ఎ ఫిల్మ్‌ బై బషీద్‌' అని వేసుకోవడం కరెక్టేనా? అది కూడా సెన్సార్‌ పూర్తయిన సినిమాలో టైటిల్‌ కార్డును మార్చే హక్కు ఎవరిచ్చారు? బషీద్‌ ఈ విషయంపై తక్షణమే స్పందించాలి అంటున్నారు బాబ్జీ.

  ఆమరణనిరాహార దీక్ష

  ఆమరణనిరాహార దీక్ష

  బషీద్ వెంటనే స్పందించకపోతే చాంబర్‌లోనూ, బషీద్‌ ఇంటిముందూ నా పెళ్లాం బిడ్డలతో ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను'' అని ‘మెంటల్‌' చిత్ర దర్శకుడు కరణం బాబ్జీ చెప్పారు. మరి అయితే ఇప్పటివరకూ నిర్మాత బషీద్ మాత్రం ఎక్కడా స్పందించినట్లు కనపడలేదు. దాంతో ఈ వివాదం ఎటు తిరగనుందో తెలియాల్సి ఉంది.

  ఎంతో కష్టపడి తెరకెక్కించా

  ఎంతో కష్టపడి తెరకెక్కించా

  నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 16 ఏళ్లయింది. దర్శకుడిగా మారి 16 నెలల కష్టంతో ‘మెంటల్‌' సినిమా తెరకెక్కించాను. శ్రీకాంత్ మీదున్న ఇష్టంతో పారితోషికం తీసుకోకుండా తిరిగి 15 లక్షలు ఖర్చుచేసి ఈ సినిమా చేశాను. దర్శకుడిగా దాని ఫలితం నాకు చెందకుండా బషీద్‌ అడ్డుపడడం చాలా బాధాకరం అని బాబ్జీ అన్నారు.

  లీగల్ గా కూడా పోరాడుతా

  లీగల్ గా కూడా పోరాడుతా

  టైటిల్‌ విషయంలోనే పోలీస్‌లు, కోర్టులు అంటూ చాలా ఇబ్బందులో ఎదుర్కొన్నా. బషీద్‌ విషయంలో పోరాటం చేయడానికి వెనుకాడను. లీగల్‌గా వెళ్తాను అంటే పరిశ్రమకు చెందిన చాలామంది పెద్దలు నీకు న్యాయం జరగదు అని భయపెట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా'' అని బాబ్జీ అన్నారు.

  చాలా ఇబ్బందులు పడతాడు

  చాలా ఇబ్బందులు పడతాడు

  ‘‘సెన్సార్‌ పూర్తయిన తర్వాత సినిమాలో కలర్‌ మార్చాలన్నా చాలా నిబంధనలున్నాయి. వాటిని ఉల్లంఘించి బషీద్‌ దర్శకుడు పేరు తీసేయడం నేరం. ఒక నిర్మాత అయుండి అన్నీ తెలిసి అతనీ తప్పు చేశాడు. సరిదిద్దుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడతాడు. లేదంటే ఛాంబర్‌, నిర్మాతల మండలి, సెన్సార్‌ బోర్ట్‌ తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు చూడక తప్పదు'' అని వీరశంకర్‌ అన్నారు.

  భయపెట్టి నిర్మాతను మారుస్తున్నారు

  భయపెట్టి నిర్మాతను మారుస్తున్నారు

  ‘‘పరిశ్రమలోనే చాలామంది దొంగలున్నారు. ఏదైనా ఓ రిలీజ్‌ అవుతుంది అంటే ఈ సినిమా ఎవరు చూస్తారు. ఎంతోకొంతకి అమ్మేయండి అని భయపెట్టి సినిమాల్ని చేతులు మార్చుతున్నారు. ఇక్కడ జరిగింది కూడా అదే. బషీద్‌ ఒక నిర్మాత. తనకి ఇక్కడ నిబంధనలు తెలిసి కూడా తప్పు చేశాడు. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ 33 ప్రకారం అతను శిక్షకు అర్హుడు. ఈ విషయాన్ని ఇలా వదిలితే ఇలాంటి బషీద్‌లు మరో పదిమంది తయారవుతారు'' అని కొడాలి వెంకటేశ్వరరావు చెప్పారు.

  అరగంటలో చేస్తానన్న శ్రీకాంత్ మళ్ళీ

  అరగంటలో చేస్తానన్న శ్రీకాంత్ మళ్ళీ

  ఈ విషయంలో హీరో శ్రీకాంత్‌ కు ఫోన్‌ చేస్తే అరగంటలో మార్పిస్తానని చెప్పారు. మళ్లి ఇంతవరకు స్పందించలేదు. రే పటిలోగా దర్శకుడిగా నా పేరు వేయకపోతే ఫిలిం ఛాంబర్‌ ముందు నిరా హార దీక్ష చేస్తాను. అప్పటికీ మార్చకపోతే బషీద్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా.' అన్నారు.

  నిర్మాతకే అధికారం అందుకే..

  నిర్మాతకే అధికారం అందుకే..

  ఈ వివాదంపై స్పందించిన నిర్మాతల మండలి ..టైటిల్‌ మార్చే అధికారం నిర్మాతలకు మాత్రమే ఉంటుందని ‘మెంటల్‌' సినిమా నిర్మాత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

  English summary
  Srikanth’s Mental film's director Babji alleges that though he directed the film and has been working on the project from the past one and half year, he was not credited in the title cards of the final copy and instead it was changed to someone else name 'Basheed'. .
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more