»   » శ్రీకాంత్ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు

శ్రీకాంత్ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోల్లో ఒకరైన శ్రీకాంత్.... త్వరలో తన తనయుడు రోషన్‍‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుండటం గమనార్హం. సన్ షైన్ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో పి. రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్, కుమార్తో మేధ. పెద్ద కొడుకు రోషన్ వయసు 20 సంవత్సరాల లోపే... ఇతన్ని క్యూట్ లవ్ స్టోరీ ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పి. రామ్ మోహన్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Srikanth's son to make his debut as hero

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ మధ్య కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలను చిన్న తనంలోనే తమ వారసులను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఆంధ్ర పోరి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే దారిలో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ను వెండి తెరకు పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Now if the reports are to be believed, Roshan, elder son of Srikanth, is all set to make his entry into the Telugu film industry as hero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu