»   » శ్రీకాంత్ ని చూసి జాలి పడుతున్నారు

శ్రీకాంత్ ని చూసి జాలి పడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు ప్లాపుతో శ్రీకాంత్ కి దిక్కుతోచని పరిస్దితి ఏర్పడింది.అందులో ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. అలాగే తన తమ్ముడుని నిర్మాతగా మార్చి తీసిన 'విరోధి' కూడా ప్లాపుల బాటలోకి ప్రయాణం పెట్టుకోవటం శ్రీకాంత్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందనిపిస్తోంది.

నీలకంఠ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అటూ కమర్షియల్ గానూ వర్కవుట్ కాలేదు. అలాగని విమర్సకులు నుంచి మార్కులు సంపాదించుకోలేకపోయింది. అంతేగాక గోరు చుట్టుపై రోకటి పోటులా జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. దాంతో అందరూ ఈ సినిమాని శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనటం ఆయనకు బాధ కలిగిస్తోంది. తన డబ్బు పెట్టి ఇలా వేరొకరికి పేరు తేవటం ఏమిటా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

English summary
Neelakanta has returned after a long gap and he has come up with a risky subject on Naxalism as the backdrop. Virodhi moves on with a slow pace in the beginning and picks up its momentum in the second half of the film and ends well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu