»   » ‘శ్రీమంతుడు’ : మహేష్ అభిమానులకు శుభవార్త

‘శ్రీమంతుడు’ : మహేష్ అభిమానులకు శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే డేట్ ప్రకటించినా ఇప్పటివరకూ షూటింగ్ పూర్తి కాకపోవటం, పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం కాకపోవటం అభిమానులను ఆందోళన పరిచింది. అయితే వారి టెన్షన్ ని విముక్తి చేస్తూ శ్రీమంతుడు చిత్రం టీమ్ ..తమ చిత్రం షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసామని ప్రకటించింది.
కొన్ని పాటలు, కొంత ప్యాచ్ వర్క్ తప్పించి సినిమా పూర్తైందని అంది. ఆ టీమ్ ఏమందో మీరూ చూడండి.

We have finished the entire shoot of #Srimanthudu and the dubbing works are in progress! Grand Audio launch on July 18th and Grand Worldwide Movie release on August 7th! :)


Posted by Srimanthudu on 2 July 2015

ఇప్పటికే మహేష్ బాబు..డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. సినిమా పొస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టింది. త్వరలో దేవిశ్రీప్రసాద్ సైతం ...రీరికార్డింగ్ మొదలెడతారు. ఈ లోగా కొరటాల శివ...ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసి రన్ టైమ్ లాక్ చేస్తే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'శ్రీమంతుడు' విశేషాలకు వస్తే...


ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.


ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా ‘శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.


 “Srimanthdu” team have finished the shooting part.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు.


మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.


ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.


'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


శ్రీమంతుడు విడుదల తేదీని...బాహుబలి రిలీజ్ గురించి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇఫ్పటికే ...బాహుబలి నిర్మాత ధాంక్స్ చెప్పారు. అలాగే శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ సైతం మాట్లాడారు. ఈ నేపధ్యంలో ఈ విషయమై రాజమౌళి సైతం వివరణ ఇచ్చారు.


రాజమౌళి మాట్లాడుతూ... మా తరపు నుంచి జరిగిన పొరపాటేమిటంటే.. మా సినిమా విడుదల చెయ్యాలంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కూడా చూసుకోవాలి. కర్ణాటకలోనూ అక్కడి సినిమాలు ఏం విడుదలవుతున్నాయో కూడా చూసుకోవాలి. అన్ని ఏరియాలూ చూసుకొని, జూలై 10 మంచిదనుకొని ప్రకటించాం.


అప్పటికే ‘శ్రీమంతుడు'ను వాళ్లు జూలై 17న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారనే విషయం ఆ తర్వాతే మాకు తెలిసింది. దాంతో ‘ఇలా జరిగిందేమిటబ్బా' అనుకున్నాం. నిజానికి మాకు వేరే చాయిస్‌ లేదు. వాళ్ల విడుదల తేదీ మాకు తెలిసినా, మా ఇబ్బంది వాళ్లకు చెప్పి, వాళ్లచేత ఆ పనే చేసుండేవాళ్లం. లక్కీగా వాళ్లకు కూడా పని పూర్తికాలేదు.


వాళ్లకు ఫస్ట్‌కాపీ రెడీగా ఉన్నట్లయితే, మాకు పెద్ద సమస్య అయ్యుండేది. వాళ్లదీ పెద్ద సినిమా. ఈ నెలాఖరు దాకా షూటింగ్‌ ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కావాల్సి ఉంది. వాళ్లకూ కనీసం ఒకటిన్నర నెల టైమ్‌ కావాలి. అలా మాకు కలిసొచ్చింది. వాళ్లు కూడా మా పరిస్థితి అర్థం చేసుకుని, వారి సినిమాని పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు. బయట ఎన్ననుకుంటున్నా, అంతర్గతంగా వాళ్లూ మేమూ మాట్లాడుకుంటూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు.


English summary
“Srimanthdu” team has officially announced today they have finished the shooting part.
Please Wait while comments are loading...