»   » షాకింగ్: ‘శ్రీమంతుడు’ 10 టికెట్లకు రూ. 9.58 లక్షలు!

షాకింగ్: ‘శ్రీమంతుడు’ 10 టికెట్లకు రూ. 9.58 లక్షలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. విదేశాల్లోనూ ఆయనూ ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన గత సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ‘శ్రీమంతుడు' సినిమాను అమెరికాలో రికార్డు స్థాయిలో 150 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.

తాజాగా అమెరికాలోని మహేష్ బాబు వీరాభిమానులు..... యూఎస్ ప్రీమియర్ షోకు సంబంధించిన తొలి 10 టికెట్లను ఏకంగా 15000 అమెరికన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. మన కరెన్సీ ప్రకారం ఆ పది టికెట్లను 9.58 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారన్నమాట. అభిమానుల్ని చూసాం కానీ మరీ ఈ రేంజిలో డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల్ని ఇప్పుడే చూస్తున్నాం అంటూ పలువురు ఆశ్చర్య పోతున్నారు.


క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.


Srimanthudu 10 tickets 15000 dollars

జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.

English summary
Mahesh Babu fans paid a fancy price of $ 15,000 dollars for the first 10 tickets of the Srimanthudu premier show in the US.
Please Wait while comments are loading...