»   »  భారీ ధర: ‘బాహుబలి’ తర్వాత మహేష్ ‘శ్రీమంతుడే’

భారీ ధర: ‘బాహుబలి’ తర్వాత మహేష్ ‘శ్రీమంతుడే’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' చిత్రం ఆడియో ఈ నెల 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్ష్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ చానల్ రూ. 1 కోటి రూపాయలకు రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్స్ రూ. 1.5 కోట్లకు అమ్ముడయ్యాయి. బాహుబలి తర్వాత ఆడియో టెలికాస్ట్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడు పోయిన సినిమా ఇదే.


Srimanthudu audio launch telecast rights sold for a whopping price

మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
The audio launch of Srimanthudu will be held on June 27th. According to the reliable sources, it is heard that the audio Live rights of Srimanthudu were sold out for a whopping sum of Rs 1 Crore to a popular TV channel.
Please Wait while comments are loading...