twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గబ్బర్‌సింగ్, మగధీర, ఈగ లైఫ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన ‘శ్రీమంతుడు’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శ్రీమంతుడు' చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈచిత్రం భారీగా వసూళ్లు సాధించింది. దీంతో పాటు మంచి సినిమా అనే మన్ననలూ అందుకుంటోంది. సోషల్ రెస్పాన్సబులిటీతో పాటు ఎంటర్టెనింగ్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతం అంటూ పలువురు ప్రముఖులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.

    ‘శ్రీమంతుడు' రోజులు గడిచే కొద్దీ ఇంతింతై వటుడింతై అన్నట్లు తన రేంజి పెంచుకుంటోంది. తొలి 9 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఐదో వారం కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

     Srimanthudu beats Gabbar Singh, Magadheera and Eega life-time records!

    తెలుగు సినిమా పరిశ్రమలోని హయ్యెస్ట్ గ్రాసర్లలో ‘శ్రీమంతుడు' రెండో స్థానంలో నిలిచింది. 26 రోజుల్లో ఈ చిత్రం రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. గత సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ (150 కోట్ల గ్రాస్), ఈగ (125 కోట్ల గ్రాస్), మగధీర (150 కోట్ల గ్రాస్) లైఫ్ టైమ్ రికార్డులను ఈచిత్రం బద్దలు కొట్టింది.

    మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలైంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.

    ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Srimanthudu became one of the highest grossing Telugu films and it has collected Rs 160+ Crore within 26 days. This Mahesh Babu starrer managed to beat Pawan Kalyan’s Gabbar Singh, which collected Rs 150 Crore, Eega (125 Crore) and Magadheera that collected Rs 150 Crore lifetime records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X