»   » ఏపీ రాజధానికోసం ‘శ్రీమంతుడు’ డొనేషన్

ఏపీ రాజధానికోసం ‘శ్రీమంతుడు’ డొనేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ‘శ్రీమంతుడు' చిత్ర నిర్మాతలు డొనేషన్ అందించారు. శ్రీమంతుడు సినిమా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు నిర్వహించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేసారు. రూరల్ డెవలప్ మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సినిమా ఆదర్శప్రాయంగా ఉందంటూ ప్రశంసలు గుప్పించారు.

‘శ్రీమంతుడు' మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అఫీషియల్ గా విడుదల చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. థియేటర్ల రెంట్, ఇతర ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్లకు రూ. 66.5 కోట్ల షేర్ వచ్చింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 66,57,99,056 షర్ కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

ఈ చిత్రం సాధించిన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ..‘కథని నమ్మి చేసాను. శివగారు మంచి కథ రాసారు. అందరం కథని ఫాలో అయ్యాం. మంచి కథకు టీమ్ వర్క్ తోడయితే ఎంత పెద్ద విజయం సాధిస్తుందో ‘శ్రీమంతుడు' నిరూపించింది. నాన్న, అన్నయ్య, బాబాయ్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది అన్నారు.

Srimanthudu donation to AP Capital

ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆడియన్స్ ముఖ్యంగా నా అభిమానులు ఈ విజయానికి ఎంతో ఆనందపడుతున్నారు. నా జీవితంలో ఈ బర్త్ డే రియల్ గా చాలా హ్యాపీగా ఉన్న బర్త్ డే. ఈ సక్సెస్ తో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి నాకు ఉత్సాహం వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ వియానికి కొరటల శివగారు ముఖ్య కారకులు. ఆయనే ఈ సినిమాకు హీరో అని నా ఫీలింగ్ అన్నారు మహేష్.

తొలి చిత్రం అయినా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం కాంప్రమైజ్ అవకుండా తీసారు. అన్ని విధాలా నేను సంతృప్తి చెందిన చిత్రం ‘శ్రీమంతుడు'. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిలిం ‘శ్రీమంతుడే' అన్నారు మహేష్ బాబు. ఈ సినిమా తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుని వరల్డ్ వైడ్ షేర్ : రూ. 66,57,99,056 షేర్ సాధించింది.

English summary
Naveen Yerneni - producer of Srimanthudu met Chandra Babu Naidu and donated the collections of Srimanthudu premieres in the form of cheque.
Please Wait while comments are loading...