»   » ‘శ్రీమంతుడు’ నా కెరీర్‌లో బెస్ట్‌ఫిల్మ్: మహేష్ బాబు

‘శ్రీమంతుడు’ నా కెరీర్‌లో బెస్ట్‌ఫిల్మ్: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ హీరోగా ‘మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రం సాధించిన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ..‘కథని నమ్మి చేసాను. శివగారు మంచి కథ రాసారు. అందరం కథని ఫాలో అయ్యాం. మంచి కథకు టీమ్ వర్క్ తోడయితే ఎంత పెద్ద విజయం సాధిస్తుందో ‘శ్రీమంతుడు' నిరూపించింది. నాన్న, అన్నయ్య, బాబాయ్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది అన్నారు.


Srimanthudu is the best film in my career: Mahesh Babu

ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆడియన్స్ ముఖ్యంగా నా అభిమానులు ఈ విజయానికి ఎంతో ఆనందపడుతున్నారు. నా జీవితంలో ఈ బర్త్ డే రియల్ గా చాలా హ్యాపీగా ఉన్న బర్త్ డే. ఈ సక్సెస్ తో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి నాకు ఉత్సాహం వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ వియానికి కొరటల శివగారు ముఖ్య కారకులు. ఆయనే ఈ సినిమాకు హీరో అని నా ఫీలింగ్ అన్నారు మహేష్.


తొలి చిత్రం అయినా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం కాంప్రమైజ్ అవకుండా తీసారు. అన్ని విధాలా నేను సంతృప్తి చెందిన చిత్రం ‘శ్రీమంతుడు'. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిలిం ‘శ్రీమంతుడే' అన్నారు మహేష్ బాబు. ఈ సినిమా తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుని వరల్డ్ వైడ్ షేర్ : రూ. 66,57,99,056 షేర్ సాధించింది.

English summary
"Srimanthudu is the best film in my career" Mahesh Babu said.
Please Wait while comments are loading...