»   » షాకింగ్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు లీక్

షాకింగ్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమను కేవలం పైరసీ సమస్య మాత్రమే వేధిస్తుంది. ఇపుడు కొత్తగా మరో అంశం కూడా దర్శక నిర్మాతలను ఆందోళన పరుస్తోంది. విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన పాటలు, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్లో లీక్ చేస్తున్నారు.

ఇటీవలే ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ఆడియో వాట్సాఫ్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన ఆడియో ట్రాకులు కూడా లీక్ అయ్యాయి. రెండు రోజులుగా ఈ పాటలు వాట్సాఫ్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఇవి వేగంగా ఒకరి నుండి ఒకరికి షేర్ అవుతున్నాయి.


Srimanthudu Songs Leaked Online

కొందరు అభిమానులు ట్విట్టర్లో ఈ పాటలపై రివ్యూలు కూడా రాస్తున్నారు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన జల్సా, మిస్టర్ పెర్ఫెక్ట్, ఆర్య 2 తో పాటు చాలా సినిమాలు ఇలాంటి లీక్ సమస్యలు ఎదుర్కొన్నాయి. అయితే ఆడియో లీకులపై దర్శక నిర్మాతలు ఎన్నడూ సీరియస్ గా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. వారి ఉదాసీన వైఖరే తాజాగా ‘శ్రీమంతుడు' పాటలు లీక్ కావడానికి కారణమైనట్లు స్పష్టమవుతోంది.


శ్రీమంతుడు ఆడియో వేడుక జూన్ 26న చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా జులై 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
After Baahubali, now its the turn of Mahesh Babu's Srimanthudu to suffer audio tracks leakage. Couple of songs from the album has been doing rounds on the social networking sites and applications from past two days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu