twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు బాగా బిజీ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చాడు

    "పెళ్ళికిముందు ప్రేమ కధ" చిత్రానికి అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోగా, దర్శకుడుగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ముద్ర వేసుకుని దూసుకుపోతున్నారు అవసరాల శ్రీనివాస్. తన కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా కొన్ని ఆబ్లిగేషన్స్ ని ఎవరూ కాదనలేరు. అలాగే ...ఇప్పుడు ఆయన ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు.

    పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "పెళ్ళికిముందు ప్రేమ కధ".

    Srinivas Avasarala voice over for Pelliki Mundu Prema Katha

    "రాజుగారి గది" ఫేమ్ చేతన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ చెప్పారు. నేటితరం యువత జీవితంలో చాలా కీలకమైన పెళ్లి అనే ఘట్టానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆ కారణంగా వారి జీవితాల్లో తలెత్తుతున్న సమస్యల నేపధ్యంలో విజ్ణానానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

    ఈ సందర్భంగా డి.ఎస్ రావు మాట్లాడుతూ.. "నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేటితరానికి మంచి మెసేజ్ తోపాటు ఎంటర్ టైన్మెంట్ ను అందించే సినిమా "పెళ్ళికి ముందు ప్రేమకథ". తాగుబోతు రమేష్, సత్య, శివ ప్రసాద్, రాకేష్ ల కాంబిణేషన్ లో తెరకెక్కిన కామెడీ సీన్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఈ నెల ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాము, హీరో హీరొయిన్ కెమిస్ట్రీ ఈ పెళ్ళికి ముందు ప్రేమ కధ లో బాగా వర్క్అవుట్ అయ్యింది. ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తున్నాం" అన్నారు.

    "రాజు గారి గది" ఫేం చేతన్ శీను, సునైన హీరోహీరొయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, అశ్విని, డా.శివ ప్రసాద్, రాకేశ్, రచ్చ రవి, గౌతమి, మాస్టర్ శివ కృష్ణ, గంగాధర్, బాష , ఆర్.పి,కీర్తి నాయుడు, శ్రీ ప్రియ, యార్లగడ్డ కిరణ్, నాగేంద్ర కుమార్ తదితరలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఫోటోగ్రఫి : పి.సి. కన్నా, స్క్రీన్ ప్లే: సుధాకర్ పట్నం, రచన-దర్శకత్వం: మధు గోపు, నిర్మాతలు: డి.ఎస్.కె-సుధాకర్ పట్నం, అవినాష్ సాలండ్ర!

    English summary
    Director , Actor Srinivas Avasarala gave voice over for a new movie Pelliki Mundu Prema Katha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X