»   » శ్రీనివాసరెడ్డి మేనల్లుడు హీరోగా సినిమా

శ్రీనివాసరెడ్డి మేనల్లుడు హీరోగా సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నీతా ఫిలిమ్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 నూతన చిత్రం.. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ చేతుల మీదుగా హైద్రాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్‌ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంతో దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చంద్రశేఖర్‌ కానూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కల్కిమిత్ర కథానాయిక.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత క్రాంతి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘మా నీతా ఫిలిమ్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తొలి చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రచయిత కోన వెంకట్‌గారికి, కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి గారికి, సత్యం రాజేష్‌ గారికి, జెమిని సురేష్‌ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ద్వారా సుజిత్‌ రెడ్డి హీరోగా, చంద్రశేఖర్‌ కానూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి ఇందులో ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. మంచి కథ కుదిరింది. ఈ నెల 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది...' అన్నారు.

Srinivasa Reddy Nepew As A Hero

సుజిత్‌రెడ్డి, కల్కిమిత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్‌; సంగీతం: మణికాంత్‌ ఖాద్రి; పాటలు: అనంతశ్రీరామ్‌; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రమేష్‌శర్మ; నిర్మాత: క్రాంతి నిరంజన్‌ రెడ్డి కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: చంద్రశేఖర్‌ కానూరి.

English summary
Srinivasa Reddy Nepew Sujith Reddu As A Hero in upcoming film directed by Chandra Shekhar Kanuri.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu