»   »  ఫ్యామిలీ గొడవలు: క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల

ఫ్యామిలీ గొడవలు: క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం గడ్డు కాలం అనుభవిస్తున్నాడు. ‘ఆగడు' సినిమా ప్లాపు తర్వాత మళ్లీ ‘బ్రూస్ లీ' మూవీతో మరో భారీ పరాజయం ఆయన కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు అటు పర్సనల్ లైఫ్ నూ ఇబ్బందులు.

Srinu Vytla

ఆయన భార్య రూప వైట్ల.... శ్రీను వైట్ల మీద గృహ హింస కేసు పెట్టిందనే వార్తలు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్. ఇలాంటి వార్తలు వస్తున్న మౌనంగా ఉన్న శ్రీను వైట్ల, ఆయన భార్య రూప వైట్ల.... చైనా పర్యటకు సంబంధించి ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేయడం ద్వారా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని అభిమానులకు, ప్రేక్షకులు సందేశాన్ని పంపాడు.

‘బ్రూస్ లీ' సినిమా భారీ పరాజయం తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల ఇటీవల ఓ ఇంటర్వూలో ఫ్యామిలీ గొడవల విషయమై స్పందించారు. తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని, తాను అన్యోన్యంగా కలిసి ఉన్నామని....తన భార్య ఏ విషయంలో తనపై పూర్తి నమ్మకం కలిగి ఉందని తెలిపారు.

వరుసగా రెండు ప్లాపులు రావడంతో ప్రస్తుతం శ్రీను వైట్ల అవకాశాలు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సి కళ్యాణ్ తో ఓ భారీ ప్రాజెక్టు గురించి శ్రీను వైట్ల చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఫైనల్ అయిన తర్వాత అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

English summary
Opening up to the media for the first time after Bruce Lee's debacle and the family dispute, Srinu Vaitla said in his latest interview that his wife trusts him completely in everything.
Please Wait while comments are loading...