For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాద్‌ షా' లో కనిపించనున్న శ్రీను వైట్ల కుమార్తెలు

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్‌ షా'. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కూతుళ్లు ముగ్గురూ కనిపించనున్నారు. వారి మీద రీసెంట్ గా శ్రీను వైట్ల షూట్ చేసారు. ఈ విషయాన్ని శ్రీను వైట్ల భార్య రూపా వైట్ల సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసి,ఫోటో షేర్ చేసారు. తమ కుటుంబానికి సైతం ఈ చిత్రం మెమరబుల్ గా ఉండాలని శ్రీను వైట్ల భావిస్తున్నారు. సినిమాపై ఆ రేంజిలో శ్రీను వైట్లకు నమ్మకం వ్యక్తం అవుతోంది.

  దర్శకుడు శ్రీను వైట్ల చిత్రం గురించి మాట్లాడుతూ..... 'చదరంగంలో గెలవాలంటే ఒకే ఒక మార్గం. తెలివైన ఎత్తులు వేయాలి. ప్రత్యర్థి ఎత్తుల్ని కూడా మనమే వేసేస్తే... ఇంకా సులభంగా గెలవొచ్చు. బాద్‌ షాతో పెట్టుకొంటే అంతే! అతనితో ఆటైనా, యుద్ధమైనా ఒక వైపు నుంచే. ఎందుకంటే బాద్‌ షా డిసైడైతే సంగ్రామం ఏక పక్షమే. ఆ పోరు ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు.

  కాజల్ హీరోయిన్ గా చేస్తున్న 'బాద్‌ షా' ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...' ఎన్టీఆర్‌, కాజల్‌లపై రాజధానిలో కీలక సన్నివేశాల్ని చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నాం...కథాబలం ఉన్న చిత్రమిది. ఎన్టీఆర్‌ పాత్ర, ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొంటాయి''అన్నారు. గతంలో ఈ చిత్రం విడుదల తేదీ పై ట్విట్టర్ లో గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ట్వీట్ లో... " ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రం అవుట్ పుట్ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నాను. " అని పోస్ట్ చేసారు.

  'బాద్‌ షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌ షా' ముస్తాబవుతున్నాడు. హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌ షా' చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్.

  ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌ షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

  English summary
  Srinu Vytla has three cute daughters and the latest news is that they are part of the shooting of Baadshah and will be seen in the movie. Roopa Vytla, wife of Srinu Vytla as well as the costume designer of NTR for the movie Baadshah has shared this in her micro blogging account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X