»   » శ్రీరెడ్డి వివాదంలోకి ఎన్నారైలు.. ఆ నటిపై బ్యాన్ విధించాలి.. మా అమ్మను రోడ్డుపైకి..

శ్రీరెడ్డి వివాదంలోకి ఎన్నారైలు.. ఆ నటిపై బ్యాన్ విధించాలి.. మా అమ్మను రోడ్డుపైకి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sri Reddy Leaks : Karate Kalyani Should Be Banned

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వివాదం రోజు రోజుకు ముదురుతున్నది. వేషాలు ఇస్తామని చెప్పి కొందరు నన్ను శారీరకంగా వాడుకొన్నారు. వారిని బజారుకీడుస్తానని కొన్ని రోజులుగా శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నటి కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి మండిపడింది.

కల్యాణికి సంబంధించిన వ్యక్తులు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి... ప్రముఖ నిర్మాత డీ సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌ను ఈ వివాదంలోకి లాగడం సంచలనంగా మారింది.

 కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్

కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్

కరాటే కల్యాణి తన చెంచాలతో కలిసి అనవసరంగా ఎన్నారైలను ఈ వివాదంలోకి లాగుతున్నది. మా అసోసియేషన్ నాపై చేస్తున్న ఓ కుట్ర ఇది. మా ప్రోత్సాహంతో ఈ చెండాలన్నంతా ఎన్నారైలకు అంటించే ప్రయత్నం చేస్తున్నది.

 పరిశ్రమను భ్రష్టుపట్టించేందుకు

పరిశ్రమను భ్రష్టుపట్టించేందుకు

సినీ పరిశ్రమను భ్రష్టుపట్టించేందుకు ప్రయత్నిస్తున్న కరాటే కల్యాణిని ప్రపంచమంతా నిషేధించాలి. నాటా, తానాతోపాటు అన్ని తెలుగు ఆర్గనైజేషన్లనీ ఆమెను బహిష్కరించాలి. మా అసోసియేషన్ నిధుల సేకరణకు వస్తే వారిని కూడా బ్యాన్ చేయాలి.

వివాదంలోకి ఎన్నారైలను..

వివాదంలోకి ఎన్నారైలను..

నా వివాదంలోకి ఎన్నారైలను లాగి వారి పరువు తీసే ప్రయత్నం మా చేస్తున్నది. కావున వారిని ఏమాత్రం ప్రోత్సాహించకూడదు. ఈ విషయంపై అన్ని సంస్థలు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మా అసోసియేషన్ కుట్ర

మా అసోసియేషన్ కుట్ర

ఒకవేళ మా ఈ చెండాలాన్ని ఆపకపోతే నేను తీవ్రంగా స్పందిస్తాను. అమెరికాకు వచ్చి తెలుగు సినీ పరిశ్రమ వ్యవహారాలన్నీ బట్టబయలు చేస్తాను. నా నిరసనను ఇక ఆపే ప్రసక్తి లేదు. చాలా మంది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని శ్రీరెడ్డి ఓ పోస్టులో పేర్కొన్నారు.

 నా తల్లిని రోడ్డుపైకి తీసుకురావొద్దు

నా తల్లిని రోడ్డుపైకి తీసుకురావొద్దు

సినీ పరిశ్రమకు, నాకు మధ్య జరుగుతున్న వివాదంలోకి మా అమ్మను లాగడం ఏ మాత్రం నచ్చడం లేదు. ఈ విషయంలో మీడియా తప్పు చేస్తున్నది. ఇతరుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకోవాలని మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మ ఎంత భయపడుతున్నారో నాకు తెలుసు. మా అసోసియేషన్ నన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చింది. అలానే నా తల్లిదండ్రులను రోడ్డుపై వేయకండి అని శ్రీరెడ్డి మరో పోస్టులో పేర్కొన్నారు.

మానవ హక్కుల సంఘం స్పందన

మానవ హక్కుల సంఘం స్పందన

ఇదిలా ఉండగా, శ్రీరెడ్డి వివాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

English summary
Sri Reddy Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about casting couch. On saturday, She goes half nude at Hyderabad Film Chamber. In this occassion, She shared few sensational post in facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X