సల్మాన్‌కు షారుక్ అరుదైన బహుమతి..
గత కొద్దికాలంగా కత్తులు దూసుకొంటున్న బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దగ్గరవుతున్నారు.
గత కొద్దికాలంగా కత్తులు దూసుకొంటున్న బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దగ్గరవుతున్నారు. సల్మాన్ నిర్వహించే బిగ్ బాస్ షోకు గతంలో షారుక్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల సల్మాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రంలో షారుక్ గెస్ట్‌గా కనిపించగా, ఇప్పుడు షారుక్ నటిస్తున్న ఓ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథిగా నటిస్తున్నారు. దీంతో వారి మధ్య విభేదాలు దూరమయ్యాయనే మాట వినిపిస్తున్నది.

ఇటీవల హీరో షారూఖ్ ఓ కాస్ట్లీ బ్రాండ్ న్యూ కారును సల్మాన్‌కు బహుమతిగా ఇచ్చారట. షారూఖ్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తన చిత్రంలో నటించడానికి వచ్చిన సల్మాన్‌కు ఈ బహుమతిని అందజేశారట. ప్రస్తుతం షారుక్ సినిమా షూటింగ్‌లో సల్మాన్ పాల్గొంటున్నాడు. దోస్త్ మేరా దోస్త్ అంటే ఇదే మరి.


Click it and Unblock the Notifications











