»   » షూటింగులో గాయపడ్డ షారుక్ ఖాన్

షూటింగులో గాయపడ్డ షారుక్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ షూటింగులో గాయపడ్డారు. తన తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తుండగా గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ను ముంబైలోని బాలాభాయ్ నానావతి ఆసుపత్రికి తరలించారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, చిన్నపాటి గాయమే అని షారుక్ ప్రతినిధులు తెలిపారు.

'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఉదయం ముంబై జుహులోని మారియట్ హోటల్‌లో హెవీ డాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా షారుక్ ఖాన్ తనకు తానుగా గాయపడ్డారు. డాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా డోర్ తగిలి ముఖం, తలకు గాయమైనట్లు తెలుస్తోంది.

అయితే ఇవి అంత తీవ్రమైన గాయాలేమీ కాదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పినట్లు షారుక్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే షారుక్ కోలుకుంటారని తెలిపారు. షారుక్ మళ్లీ తిరిగి ఎప్పుడు షూటింగులో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.

హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో దీపిక పదుకొకె, అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ, సోను సూద్, వివాన్ షా తదితరులు నటిస్తున్నారు. దీపావళికి ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చికిత్స జరిగే సమయంలో దర్శకురాలు ఫరా ఖాన్ ఆయన వెంటన ఉన్నారు.

English summary
"SRK injured on the sets of #HappyNewYear. Minor injuries, his associate Karim Morani just informed me" Taran Adarsh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu