»   » సోషల్‌మీడియా కింగ్, క్వీన్ ఈ హీరో,హీరోయిన్స్

సోషల్‌మీడియా కింగ్, క్వీన్ ఈ హీరో,హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సోషల్ మీడియా అనేది మన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకొచ్చిందంటే అది లేనిదే జీవితం చాలా మందికి గడపలేని పరిస్ధతి వచ్చిసింది. ముఖ్యంగా సెలబ్రెటీలు ఈ మీడియాను తమ ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నారు. అందుకోసం వారు ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా కింగ్, క్వీన్ లను ఎంపిక చేసారు.

బాలీవుడ్‌ నటులు షారూక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రాలు సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ టాప్‌ అని ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వారిని అవార్డులతో సత్కరించింది. సోషల్‌ మీడియాలో అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ అభిప్రాయాలు పంచుకునే వారిలో షారూక్‌, ప్రియాంక ముందున్నారని బాలీవుడ్‌లైఫ్‌.కామ్‌ పోర్టల్‌ తెలిపింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

SRK, Priyanka named king and queen of social media

ఈ పోర్టల్‌ అందజేసిన సోషల్‌మీడియా ఫిలిం 2015 అవార్డుల్లో సోషల్‌మీడియా రాజుగా షారూక్‌, రాణిగా ప్రియాంక చోప్రా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల కోసం గత నెల బాలీవుడ్‌లైఫ్‌.కామ్‌ పోల్‌ నిర్వహించింది. అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు.

ఇందులో సెల్ఫీ క్వీన్‌గా సోనాక్షి సిన్హా, సెల్ఫీ కింగ్‌గా వరుణ్‌ ధావన్‌, ఇన్‌స్టాగ్రామర్‌ ఆఫ్‌ ఇయర్‌గా సోనమ్‌ కపూర్‌ అవార్డులు గెలుచుకున్నారు. మోస్ట్‌ ఫ్యాన్‌ ఫ్రెండ్లీ సౌత్‌ సెలబ్రిటీ ఆన్‌ ట్విట్టర్‌అవార్డును తమిళ నటుడు ధనుష్‌ సొంతం చేసుకున్నాడు.

English summary
Shah Rukh Khan and Priyanka Chopra have been crowned as the king and queen of social media by a leading Bollywood digital portal. Audience from across India and fans from Russia, UK and US voted in a poll carried out by Bollywood Life.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu