»   »  ట్రైలర్ లో శృతి హాసన్ సూపర్ గా ఉంది (వీడియో)

ట్రైలర్ లో శృతి హాసన్ సూపర్ గా ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కెరీర్ మొదట్లో లక్ చిత్రంతో బాలీవుడ్ లో అరంగ్రేటం చేసిన శృతి హాసన్ ఆ మధ్యన ఒకటి రెండు సినిమాలు అక్కడ చేసింది కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని హిందీ పరిశ్రమలో చూసుకోవటానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఆమె నటించిన వెల్‌కమ్‌ బ్యాక్‌ చిత్రం చేసింది. ఇప్పుడు ఆ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఉన్నవారిలో శృతి హాసన్ హైలెట్ గా ఉందని బాలీవుడ్ మీడియా అంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే... అనిల్‌ కపూర్‌ నానా పటేకర్‌, జాన్‌ అబ్రహం నటించిన చిత్రం వెల్‌కమ్‌ బ్యాక్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను అనిల్‌ కపూర్‌ తన ట్విట్టర్‌ ఖాతాద్వారా విడుదల చేశారు.

2007లో వచ్చిన వెల్‌కమ్‌ చిత్రానికి రెండో భాగమే ఈ వెల్‌కమ్‌బ్యాక్‌. 2007లో వచ్చిన వెల్‌కమ్‌ చిత్రంలో అక్షయ్‌కుమార్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించగా.. అనిల్‌ కపూర్‌, నానాపటేకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

Sruthi Hassan's ‘Welcome Back’ trailer released

తాజాగా రానున్న వెల్‌కమ్‌బ్యాక్‌ చిత్రంలోని జాన్‌అబ్రహాం సరసన శృతిహాసన్‌ జంటగా నటించనున్నారు. అనీశ్‌ బజ్మీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం పూర్తి కామెడీతో నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.

శృతిహాసన్... కెరీర్ విషయానికి వస్తే...

ప్రస్తుతం శృతి హాసన్... మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో చేస్తోంది. అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న గబ్బర్ చిత్రం(ఠాగూర్ రీమేక్)లోనూ ఆమె హీరోయిన్ గా చేసి ,ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇలా వరసగా బిజిగ ఉన్న ఆమె కార్తి,నాగార్జున ప్రాజెక్టులో కొనసాగుతుందో లేదో చూడాలి.

శృతి హాసన్ మాట్లాడుతూ...''ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు. హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు. ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం. కానీ ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం. నా కెరీర్‌లో విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది.

English summary
The team of comedy film Welcome Back, including actors Nana Patekar, John Abraham, Anil Kapoor and director Anees Bazmee, unveiled the movie’s trailer in Mumbai. Producer Firoz Nadiadwala and music director Anu Malik were also at the unveiling, but Paresh Rawal, Naseeruddin Shah and Shruti Haasan were missing.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu