twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కంటే పిచ్చోడిలా ఉన్నాడు.. బ్రహ్మండం బద్దలు కాబోతున్నది.. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌పై రాజమౌళి కామెంట్

    |

    బాలీవుడ్ చిత్రం బ్రహ్మస్త్ర తెలుగులో బ్రహ్మస్త్రంగా రాబోతున్నది. దర్శకుడు ఆయన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ తదితరుల నటించారు. అయితే ఈ సినిమాను దక్షిణాది భాషల్లో ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా మారడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఈ మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సినీ మ్యాక్స్ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ..

    రాజమౌళి సమర్పణలో బ్రహ్మస్త్ర

    రాజమౌళి సమర్పణలో బ్రహ్మస్త్ర

    బ్రహ్మస్త్రం సినిమాకు సంబంధించిన 3డీ మోషన్ పోస్టర్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ వేడుకలో కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ, నాగార్జున, ఆలియా భట్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రాజమౌళి, కరణ్ జోహర్, నాగార్జున స్చీచ్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

    నా కంటే పిచ్చోడు అనిపించేలా

    నా కంటే పిచ్చోడు అనిపించేలా

    బ్రహ్మస్త్రం మోషన్ పోస్టర్ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ నమస్కారం. నాకు సరిపడని విషయంలోకి కరణ్ జోహర్ లాక్కోచ్చారు. బ్రహ్మస్త్రం సినిమా తీస్తున్నారని కరణ్ చెప్పారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వచ్చి నాకు కథ చెప్పాడు. అప్పుడు అతడిని చూసి ఆయన్ నాకంటే పిచ్చోడు అనిపించింది. అయితే ఏడేళ్లుగా బ్రహ్మస్త్ర సినిమాపై పెట్టిన సమయం, హార్డ్ వర్క్ చూసి నాకు నచ్చింది. సినిమాపై పెడుతున్న అతడి అంకితభావం చూసి నాకు గౌరవం పెరిగింది అని అంటూ రాజమౌళి అన్నారు.

    బ్రహ్మండం బద్దలు కాబోతున్నది..

    బ్రహ్మండం బద్దలు కాబోతున్నది..

    బ్రహ్మస్త్ర సినిమా కథ విన్న తర్వాత మూవీపై ఆయన్ ముఖర్జీ తపన, అంకితభావం నాకంటే ఎక్కువ ఉందని అనిపించారు. ఏదో బ్రహ్మండం క్రియేట్ చేయబోతున్నారనే ఫీలింగ్ కలిగింది. అప్పుడే కరణ్ జోహర్ చెప్పాను. ఆయన్ ముఖర్జీలో ఏదో ఫైర్ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఆయన్ ముఖర్జీని వేదిక మీదకు ఆయన్ ఆహ్వానించారు. సినిమాను ప్రేమించే వారిని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆదరిస్తారు అని చెప్పారు.

    ఇండియన్ సినిమాలో రాజమౌళి నంబర్ వన్

    ఇండియన్ సినిమాలో రాజమౌళి నంబర్ వన్

    దర్శకుడు అయాన్ ముఖర్జీ వేదికపైన మాట్లాడుతూ.. రాజమౌళి గారంటే దేశంలోనే గొప్ప పేరుగా, బ్రాండ్‌గా మారిపోయింది. అందుకు కారణం ఆయన తపన, హార్డ్ వర్క్ అని అన్నారు. అయితే నా గురించి కాకుండా బ్రహ్మస్త్రం గురించి మాట్లాడమని చెప్పారు. దాంతో బ్రహ్మస్త్ర మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా గురించి వివరంగా చెబితే బోర్‌గా ఫీల్ అవుతారు. నా జీవితంలో ఎన్నడూ చూడని అనుభూతిని పొందుతున్నాను. సినిమా పట్ల తెలుగు వారికి, దక్షిణాది వారికి ఎంత ఆరాధనభావం ఉంటుందో నాకు తెలుసు. వారి జీవితంలో బ్రహ్మస్త్రను భాగం చేయాలనే కోరికతో ఉన్నాను అని ఆయన్ ముఖర్జీ తెలిపారు.

    Recommended Video

    RRR Trailer : Have You Observed This In The Trailer ? || Filmibeat Telugu
    నాగార్జున, కరణ్ జోహర్ గురించి

    నాగార్జున, కరణ్ జోహర్ గురించి

    బ్రహ్మస్త్ర సినిమాకు నాగార్జున అక్కినేని ఇచ్చిన సహాకారం మరువలేనిది. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌కు ప్రతీసారి అద్బుతమైన ఆతిథ్యం ఇచ్చారు. అలాగే బ్రహ్మస్త్రకు అండగా నిలిచారు. అలాగే నా గురువు, ఈ సినిమాను మొదటి పునాది కరణ్ జోహర్ కూడా నాకు అండగా నిలిచారు. బ్రహ్మస్త్రం ఓ మ్యాజిక్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. బ్రహ్మస్త్ర సినిమాకు నాకు రాజమౌళి స్పూర్తి. రాజమౌళికి కరణ్ జోహర్ ఉన్న అనుబంధం కారణంగానే ఇప్పడు బ్రహ్మస్త్ర ఇక్కడికి రావడానికి కారణమైంది.

    English summary
    Karan Johar's Brahmastra motion poster released at Hyderabad. In this occassion, SS Rajamouli comments on Brahmastra director ayan mukerji.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X