twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి మాదిరిగా కాదు.. RRR అక్కడే ఎందుకంటే.. ఆ డిమాండ్ ఉంది.. రాజమౌళి

    |

    ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న RRR షూటింగ్‌లో రాజమౌళి టీమ్ తలమునకలై ఉంది. ఈ చిత్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో చిత్రీకరించేందుకు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జక్కన బృందం ఇటీవల వడోదరకు ప్రయాణమైన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించే ఈ చిత్రాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా మలిచేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో రాజమౌళి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

     గుజరాత్ టూ మహారాష్ట్ర

    గుజరాత్ టూ మహారాష్ట్ర

    RRR మూవీ దేశవ్యాప్తంగా విస్తృత పరిధి ఉన్న చిత్రం. అందుచేత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం. గుజరాత్‌లో పది రోజుల షెడ్యూల్‌ను ముగించుకొన్న తర్వాత మహారాష్ట్రకు బయలుదేరుతాం. ఆ తర్వాత పూణేలో 20 రోజులపాటు మరో షెడ్యూల్‌ను షూట్ చేస్తాం అని రాజమౌళి తెలిపారు.

    కథ డిమాండ్ మేరకే

    కథ డిమాండ్ మేరకే

    బాహుబలి కథ డిమాండ్ చేయడంతో భారీ సెట్లు వేసి షూట్ చేశాం. కానీ RRR మూవీకి అలాంటి అవసరం లేదు. వాస్తవ లోకేషన్లలో షూట్ చేసే పరిస్థితిని స్టోరి డిమాండ్ చేస్తున్నది. అవసరమైతే భారీ సెట్లు నిర్మించే ఆలోచన కూడా ఉంది. అందుచేత దేశంలోని పలు ప్రాంతాల్లో సినిమా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం అని రాజమౌళి వెల్లడించారు.

    సీతగా అలియాభట్

    సీతగా అలియాభట్

    ఉత్తరాదిలో జరిగే RRR మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ భామ అలియాభట్ భాగమవుతారు. ఇటీవల ఈ చిత్రంలో సీత పాత్రకు ఎంపిక చేయడంపై రాజమౌళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
    ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ.. తనకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అని అలియా భట్ ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. అల్లూరి సీత రామరాజుగా నటిస్తున్న రాంచరణ్‌కు తోడుగా సీత పాత్రలో అలియాభట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు.

     400 కోట్లతో దానయ్య నిర్మాణం

    400 కోట్లతో దానయ్య నిర్మాణం

    RRR మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు అజయ్ దేవగన్, సముద్రఖని, హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్ జోన్స్ తదితరులు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దానయ్య చెప్పడం తెలిసిందే. ఈ చిత్రం జూలై 30, 2020లో రిలీజ్ కానున్నది.

    English summary
    SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 400 crore. The RRR team has already started their preparation with full swing. The actors will have an extensive Gujarat - Maharashtra schedule. SS Rajamouli will work on his 10-day schedule in Gujarat then fly down to Pune for another 20-day schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X