»   » రాజమౌళికి తెగ నచ్చేసింది, ఆతృత ఆపుకోలేక ట్వీట్!

రాజమౌళికి తెగ నచ్చేసింది, ఆతృత ఆపుకోలేక ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నిన్ను కోరి'. ఆది పినిశెట్టి కీలకమైన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ శనివారం విడుదల చేశారు. 24 గంటల్లో ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

నాని అభిమానులను, సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ దర్శకుడు రామజౌళికి కూడా తెగ నచ్చేసింది. వెంటనే ఆయన ట్విట్టర్లో తన స్పందన తెలియజేస్తూ ట్వీట్ చేశారు.


రాజమౌళి ట్వీట్

‘నిన్ను కోరి' చిత్రాన్ని నేను ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడాలి' అని రాసి ఉంది. నాని టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు' అంటూ చిత్ర యూనిట్ ను ఎంకరేజ్ చేస్తూ రాజమౌళి ట్వీట్‌ చేశారు.


నాని ఖుషీ ఖుషీ

నాని ఖుషీ ఖుషీ

రాజమౌళి ట్వీట్‌కు నాని ఖుషీ అయ్యాడు. వెంటనే స్పందిస్తూ ‘సార్‌..మీ ట్వీట్ చూసిన తర్వాత ఇప్పుడే సగం విజయం అందుకున్నట్లు ఉంది. థాంక్సూ సార్. ఫస్ట్‌డే ఫస్ట్‌ షోలో కలుద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు.


స్పందన అదిరింది

ఆన్‌లైన్లో ‘నిన్ను కోరి' ట్రైలర్‌కు ఊహించని స్పందన వచ్చింది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌తో కలిసి ఇప్పటి వరకు 50 లక్షల మంది దీన్ని వీక్షించారు. విడుదలైన 24 గంటల్లో ఇన్ని వ్యూస్‌ రావడం నాని సినిమాకు ఇదే తొలి సారి.


ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను జూన్‌ 29న నిర్వహిస్తున్నారు. జులై 7న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


సినిమా గురించి దర్శకుడు

సినిమా గురించి దర్శకుడు

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు మంచి గ్రిప్‌ ఇచ్చింది. నేను అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకారంతో షూటింగ్‌ పూర్తి చెయ్యగలిగాం. దానయ్యగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించింది'' అన్నారు.


నటీనటులు

నటీనటులు

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.English summary
Ace director Rajamouli gave a kickass momentum to Natural Star Nani's upcoming romantic entertainer Ninnu Kori. "Ninnu Kori trailer has "I want to watch it FDFS" painted all over it. NameisNani is in top form." Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X