»   »  హీరోయిన్ నమితకు ప్రమాదం, పోటీ పడ్డ అంబులెన్సులు

హీరోయిన్ నమితకు ప్రమాదం, పోటీ పడ్డ అంబులెన్సులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హీరోయిన్ నమితకు తమిళనాడులో అభిమానులు ఏ రేంజిలో ఉన్నారో తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. తమిళనాడులో నామక్కల్ సమీపంలో ఓ కార్యక్రమానికి హాజరైన నమిత అభిమానుల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆమె ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.

నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి గ్రామంలోని భగవతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణ వాళ్కై అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ నాటకాన్ని ప్రారంభించడానికి చెన్నై నుంచి నటి నమిత, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథులుగా వచ్చారు.

 Stage Falls at Namitha Event in Namakkal

నమిత వస్తుందనే విషయం తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నమిత స్టేజీ ఎక్కగానే అభిమానులంతా స్టేజీ వైపు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో స్టేజీ ఒక వైపు కూలిపోయింది. అయితే నమితకు రక్షణ వలయంగా ఉన్న వారు ఆమెను అక్కడి నుండి సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు.

అయితే స్టేజీ కూలిపోవడంతో నమిత గాయపడిందనే వార్తలు ఆ ప్రాంతంలో దావానలంలా వ్యాపించారు. దీంతో అక్కడ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. నమితను మేము ఆసుపత్రికి తీసుకెళతామంటే మేము తీసుకెళతాం అంటూ పోటీ పడ్డారు. అయితే నమిత తనకు ఎలాంటి గాయాలు కాలేదు అని సర్ది చెప్పడంతో వారు అక్కడి నుండి వెళ్లి పోయారు. అనంతరం అమె అక్కడి నుండి చెన్నై చేరుకున్నారు.

English summary

 Panic prevailed during a function attended by actor Namitha when the stage put up for the event collapsed due to overcrowding at Reddipatti near here on Monday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu