»   » మనం చూస్తే హీరోయిన్లకు డబ్బులొస్తాయి: ఆ ఫోటోల వెనక షాకింగ్ వాస్తవాలు!

మనం చూస్తే హీరోయిన్లకు డబ్బులొస్తాయి: ఆ ఫోటోల వెనక షాకింగ్ వాస్తవాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినీ స్టార్లంతా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా సైట్లు చాలా కాలం క్రితమే వాడుకలోకి వచ్చినా..... కొంత మంది స్టార్లు మాత్రమే వాటి ద్వారా అభిమానులకు అందుబాటు ఉండే వారు. అయితే వాటి విలువ తెలిసిన తర్వాత ప్రతి స్టారూ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి అకౌంట్స్ మెయింటేన్ చేస్తూ వస్తున్నారు.

కొందరు స్టార్లు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తమకు వాటిని మెయింటేన్ చేసే సమయం లేకున్నా... ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరీ వాటిని రన్ చేస్తున్నారు. ఇపుడు పరిస్థితి ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అ ఆస్టార్ అంత తోపు అనే పరిస్థితి.

పలు కొర్పొరెట్ సంస్థలు కూడా హీరోలు, హీరోయిన్లకు పరిశ్రమలో ఉన్న క్రేజ్, సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ ను బేస్ చేసుకుని డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సెల్ఫీ మేనియా బాగా విస్తరించిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, హీరోలు కూడా సోషల్ మీడియాలో అప్పడప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు పోస్టు చేస్తున్నారు.

అయితే వారి పోస్టుల వెనక కేవలం అభిమానులను ఎంటర్టెన్ చేద్దామనే ఉద్దేశ్యం మాత్రమే కాదు..... మనీ సంపాదించే ఉపాయం కూడా ఉంది. కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆయా స్టార్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆయా కంపెనీల ఫోన్లు పట్టుకుని హీరో లేదా హీరోయిన్ ఫోటో దిగడం ద్వారా అమ్మకాలు బాగా పెరుగుతున్నాయట. తమ అభిమాన స్టార్లు అదే ఫోన్లు వాడుతున్నారని భావించి ఫ్యాన్స్ ఆయా ఫోన్లను తెగ కొనేస్తున్నారట. డైరెక్టుగా ఆయా స్టార్లతో యాడ్స్ చేయడం కంటే ఇలా తమ సోషల్ మీడియాలో సెల్పీ ఫోటోలు పోస్టు చేయించడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయట.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

హీరోయిన్లు..

హీరోయిన్లు..

ప్రస్తుతం తమన్నా, కాజల్, రెజీనా, తాప్సీ, బిపాసా బసు లాంటి వారు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నరు.

ఎంత ఇస్తారు?

ఎంత ఇస్తారు?

ట్వీట్ కి ఇంత అని రేటు మాట్లాడుకుంటారట. ఫాలోయింగ్ బాగా ఉన్న హీరోయిన్లకు రూ. లక్ష వరకు డబ్బులిస్తారట.

డీల్..

డీల్..

పరిమిత కాల వ్యవధిలో ఇన్ని ట్వీట్స్ చేయాలనే రీతిలో ఒప్పందాలు ఉంటాయని, అందుకు గానీ హీరోయిన్ రేంజి బట్టి రూ. 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఈ డీల్స్ ఉంటాయని సమాచారం.

హీరోలు తక్కువే..

హీరోలు తక్కువే..

ఈ తరహా డీల్స్ కుదుర్చుకోవడంలో హీరోయిన్లే ముందున్నారు. హీరోల కంటే హీరోయిన్లతో ఇలాంటి ప్రచారం చేయించడానికే కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.

ప్రమోషన్స్

ప్రమోషన్స్

దీంతో పాటు కొందరు స్టార్స్ ఆయా సంస్థను ప్రమోట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

యాడ్ ఫిల్మ్స్

యాడ్ ఫిల్మ్స్

యాడ్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయడం కూడా ఇందులో భాగమే.

హీరోలు తక్కువే..

హీరోలు తక్కువే..

ఈ తరహా యాడ్స్ లో స్టార్ హీరోలు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి.

English summary
Check out Star celebrities corporate selfie deals with mobile companies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu