»   » ఆ రాత్రి హీరోయిన్లుంటే... ఆ మజాయే వేరు!(ఫోటో ఫీచర్)

ఆ రాత్రి హీరోయిన్లుంటే... ఆ మజాయే వేరు!(ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: మరి కొన్ని రోజుల్లో 2012 సంవత్సరం పూర్తయి 2013వ సంవత్సరం రాబోతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఉండే సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హోటళ్లు, క్లబ్బులు తమ కస్టమర్ల కోసం భారీ ఎత్తున వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి.

  కత్రినా కైఫ్: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇలాంటి ఈ వెంట్లలో ఓ 30 నిమిషాలు డాన్స్ చేస్తే దాదాపు రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తోంది.

  ప్రియాంక చోప్రా: టాప్ 5లో ఉన్న ప్రియాంక చోప్రా దాదాపు రూ. కోటిన్నర నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తోంది.

  బిపాసా బసు: బిపాసా బసు ఇప్పటికే ఓ స్టార్ హోటల్ లో ప్రోగ్రాం చేయడానికి కమిటైందట. అరగంట డాన్స్ చేయడానికి రూ. 1 కోటి చార్జ్ చేస్తోందట.

  కంగన రనౌత్: హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఏమీ తక్కువ కాదు. అమ్మడు రూ. కోటికి తగ్గకుండా తీసుకుంటోంది.

  సన్నీ లియోన్: ఈ సంవత్సరమే బాలీవుడ్‌కు పరిచయం అయిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ రూ. 26 లక్షలకు డిసెంబర్ 31 రాత్రికి కమిటైందట. మరికొందరు కింది స్థాయి హీరోయిన్ల రేటు దాదాపు రూ. 10 నుంచి 20 లక్షల మధ్య ఉంది.

  పదేళ్ల క్రితం అంతంత మాత్రంగానే ఉన్న న్యూఇయర్ క్రేజ్... ఇప్పుడు మరీ ఎక్కువైంది. జీరో డే రోజు రాత్రి పోటీ పడి ఈవెంట్స్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి వారితో స్టెప్పులేయించడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది.

  రెండు మూడు నెలలు కష్టపడి సినిమాల్లో నటిస్తే వచ్చే మొత్తం.... ఆ ఒక్క రోజు రాత్రి ఓ గంట డాన్స్ చేస్తే వస్తుండటంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం స్టెప్పులు వేయడానికి వెనుకాడటం లేదు. తమకున్న క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ కూడా నిర్వాహకుల నుంచి డిమాండ్ చేసి మరీ రాబట్టుకుంటున్నారు.

  English summary
  Event organizers are chasing Bollywood stars- especially the heroines- for New Year's Eve performances. Kaif has been the top draw for stage shows and this New Year's Eve is no different. Trade insiders reveal that hottie Kat is being offered a cool Rs.3 crore package for a half-hour performance.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more