»   » సర్వేలో పవన్ కళ్యాణ్ 5 వ స్ధానం

సర్వేలో పవన్ కళ్యాణ్ 5 వ స్ధానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాప్ 5 బెస్ట్ ఫ్యాన్ పాలోయింగ్ నటులు అంటూ 'స్టార్ ఇండియా' వారు సర్వే చేయటం జరిగింది. భారతదేశంలో అన్ని భాషల నటులను పరిగణనలోకి తీసుకుని చేసిన ఆ సర్వేలో పవన్ కళ్యాణ్ కీ చోటు దొరికింది. పవన్ కళ్యాణ్ ఐదవ స్ధానంలో ఈ సర్వేలో వచ్చారు. మొదటి స్ధానాల్లో బాలీవుడ్ స్టార్స్ ఉండటం గమనార్హం.ఆ లిస్ట్ ఇలా సాగింది.

Star India survey: PK in Top 5 Best Fan Following Actors in India!

1. సల్మాన్ ఖాన్ : కింగ్ ఆఫ్ మాసెస్ !

2. షారూఖ్ ఖాన్ : కింగ్ ఆఫ్ రొమాన్స్ !

3.అమీర్ ఖాన్: ఇంటిల్ జెంట్ & సెన్సిబుల్ సినిమా!

4. విజయ్ : మాస్ మసాలా!

5. పవన్ కళ్యాణ్: ఎంటర్టైనర్, మేనరిజమ్స్,ఐజియాలజీ


ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. రకరకాల కారణాలతో ఈ చిత్రం ప్రారంభం డిలే అవుతూ వచ్చినా స్క్రిప్టు పరంగా పవన్ కి పూర్తి సంతృప్తి చెందాడని అందుకే త్వరలోనే కంటిన్యూ షెడ్యూల్ ప్రాంరంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

English summary
The latest result of Star India survey to found out the Top 5 Best Fan Following Actors in the country have been revealed. Pawan Kalyan occupied the 5th spot, after Bollywood superstars Salman, Shahrukh, Aamir and Kollywood star Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu