Don't Miss!
- Lifestyle
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే.. రాత్రయినా, పగలైనా 'పడక' పని సాఫీగా సాగుతుంది
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varasudu కథ మహేష్ కోసం అనుకున్నాం.. మరో ఇద్దరు హీరోలకు కూడా.. ఏమైందంటే: దిల్ రాజు
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రొడక్షన్లో నిర్మించిన వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ ప్రాజెక్టు దియేటర్ల విషయంలో కూడా కొంత వివాదం నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ విషయంలో మొదట తెలుగు హీరోలను అనుకున్నట్లుగా దిల్ రాజు చెప్పారు. ఇక వారు ఎందుకు చేయలేదు అనే విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వారసుడు వివాదం
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కథానాయకుడుగా నటించిన వారసుడు సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే దిల్ రాజు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.
అయితే విజయ్ తమిళ హీరో కాబట్టి తెలుగులో విడుదల విషయంలో థియేటర్లు ఎక్కువగా ఇవ్వడం కుదరదని, ముందుగా తెలుగు హీరోలకి ఇవ్వాలి అని ఇటీవల కొంతమందిని నిర్మాతలు వ్యాఖ్యానించడం వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

సమన్యాయం ఉండేలా..
ఆ వివాదం పై స్పందించిన దిల్ రాజు.. ఈ విషయంలో థియేటర్స్ ఎవరికి ఎంత రావాలి అనేదానిలో కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది అని జనవరి మొదటి వారం లోపు అందరికీ సమన్యాయం ఉండేలా థియేటర్ల పంపిణీ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. విజయ్ సినిమా మాత్రమే కాకుండా చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ గారి వీర సింహారెడ్డి సినిమా లు కూడా గ్రాండ్ గానే విడుదలవుతున్నాయి అని దిల్ రాజు తెలియజేశారు.

మాకు ఉన్నది 37 థియేటర్లు
ఆ రెండు సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తో అలాగే మా నిర్మాణ సంస్థకు ఎలాంటి వివాదాలు లేవు అని మధ్యలో కొందరు కావాలని ఈ విధంగా తనని టార్గెట్ చేస్తున్నారు అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి కామెంట్స్ అనేవి తాను ఎప్పటికీ పట్టించుకోను అని మాకు నైజాంలో ఉన్నది 37 థియేటర్లు మాత్రమే అని మిగతా థియేటర్లలో సినిమా డిమాండ్ ని బట్టి రిలీజ్ అవుతుంది అని అన్నారు.

మొదట మహేష్ బాబుతో..
అయితే అలాగే వారసుడు సినిమా కథ విషయంలో కూడా దిల్ రాజు ముందుగా తెలుగు హీరోలకు చెప్పినట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే మహేష్ బాబు వేరే కమిట్మెంట్ తో బిజీగా ఉండడం వలన ఆ కాంబినేషన్ సెట్ కాలేకపోయింది.. అని దిల్ రాజు చెప్పారు.

అందుకే విజయ్ తో వారసుడు
అంతేకాకుండా మహేష్ బాబు తర్వాత మరికొంతమంది తెలుగు హీరోలతో కూడా ఈ సినిమా చేయాలని అనుకున్నాము. ఈ కథ గురించి రాంచరణ్ కు కూడా తెలుసు. కానీ అంతకుముందే మా ప్రొడక్షన్లో రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
కాబట్టి ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అలాగే అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా మిగతా హీరోలు కూడా మిగతా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే తెలుగు హీరోను కాకుండా తమిళ హీరో విజయ్ డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమాను అతనితో చేయడానికి డిసైడ్ అయినట్లుగా దిల్ రాజు వివరణ ఇచ్చారు.