»   » టాలీవుడ్ సెక్స్ రాకెట్: సిగ్గుపడాల్సింది ఇండస్ట్రీ కాదు... వారే అంటున్న తమ్మారెడ్డి!

టాలీవుడ్ సెక్స్ రాకెట్: సిగ్గుపడాల్సింది ఇండస్ట్రీ కాదు... వారే అంటున్న తమ్మారెడ్డి!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Tammareddy Bharadwaj Talks About Tollywood Issue

  యూఎస్ఏ టాలీవుడ్ సెక్స్ రాకెట్ బట్టబయలైన తర్వాత 'సినీ ఇండస్ట్రీని నిందిస్తుండటం... ఇలాంటివి చోటు చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు సిగ్గు చేటు' అంటూ వస్తున్న కామెంట్లపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. సిగ్గు పడాల్సింది ఇండస్ట్రీ కాదు, వ్యభిచారం చేసిన వారు..... ఇక్కడి వారిని అక్కడికి పిలిపించి మభ్యపెట్టి, బెదిరించి, బలవంతపెట్టి ఇలాంటి నీచమైన పనులు చేయిస్తున్నవారే సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.

  సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదు

  సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదు

  ఇక్కడ ఎవరు సినిమా వాళ్లు? ఎవరు కాదు? అనేదే అసలు సమస్య. సినిమా వాళ్లు అంటే అర్థం ఏమిటి? ఉదాహరణకు నేను నటున్ని అంటే మీరు నమ్ముతారా? భరద్వాజగా నేను మీకు తెలుసు, భరద్వాజగానే మాట్లాడతాను. నేను నటుడిని, మా అసోసియేషన్ ఉంది అంటే కుదరదు. ఒకటి రెండు సినిమాల్లో నేను వేషాలు వేసి ఉండొచ్చు. వేషం వేసిన ప్రతి వాడు నటుడు అయిపోడు, నటులు ఏదైనా నేరాల్లో ఇరుక్కుంటే సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం సరైంది కాదు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

  సిగ్గుతో తలదించుకోవాల్సింది వారు

  సిగ్గుతో తలదించుకోవాల్సింది వారు

  యూఎస్ఏకు వెళ్లిన వారిలో దాదాపు 30 మంది పేర్లు బయట పెట్టారు. అందులో పైనున్న మూడు నాలుగు పేర్లు మాత్రమే సినిమా వాళ్లవి. మిగతా పేర్లన్నీ సినిమా వాళ్లవా? కాదా? అనే విషయం పక్కన పెడితే... ఎక్కువ మంది రెండు మూడు సినిమాలు చేసిన వారే. వారినే మభ్యపెట్టి యూఎస్ఏ తీసుకెళ్లి మోసం చేశారో? వాళ్లు ఇష్టపడితే చేయించారో? బలవంతంగా చేశారో? ఏదో ఒకటి జరిగింది. ఇదంతా జరిగితే సినిమా ఇండస్ట్రీ ఎందుకు తలదించుకోవాలి? సినిమా ఇండస్ట్రీకి అలాంటి అవసరం ఏమిటి? సిగ్గుతో తలదించుకోవాల్సిన వారు అమెరికాలో ఉండి ఇదంతా చేయించిన వారే... అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

   అలా చేస్తేనే దీన్ని ఆపగలం

  అలా చేస్తేనే దీన్ని ఆపగలం

  అవసరం వల్లనో, ఏదో ఆశతోనో కొందరు ఇందులోకి దిగిఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరు వారిని ఈ నరకంలోకి తోస్తున్నారు? అనేదే ముఖ్యం. అలా తోసిన వారిని మనం ఆపగలిగితే బావుంటుంది. స్త్రీ ఒక కమొడిటీ అయిపోయింది. వాడకందారు ఉంటేనే కమొడిటీకి పని ఉంటుంది. వాడకం దారు లేకుంటే కమొడిటీకి పని ఉండదు. వాడకం దారు లేకుండా చేయడం అనేది ఎంతో ముఖ్యం. అలా జరుగాలంటే వ్యభిచారంలోకి దిగిన వారి వద్దకు పురుషుడు వెళ్లకుండా ఉండటం జరుగాలి.... అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

  చేయించేవాడు ఉంటేనే చేసే వాళ్లు వస్తారు

  చేయించేవాడు ఉంటేనే చేసే వాళ్లు వస్తారు

  సిగ్గుపడాల్సింది ఇక్కడి నుండి వెళ్లినవారు కాదు. వారిని ఆశపెట్టి తీసుకెళ్లారు. డబ్బులు ఇస్తామన్నారో? వేషాలిస్తామన్నారో? దీని వల్ల ఇంకేమైనా లాభం జరుగుతుందన్నారో? తెలియదు. ఏదో ఒకరకంగా మభ్యపెట్టి తీసుకెళ్లారు. కొంత మందిని మోసం చేసి తీసుకెళ్లారు, కొంత మందిని అక్కడికి వెళ్లాక బలవంతం చేశారని టీవీల్లో వస్తోంది, పేపర్లలో వస్తోంది. చేయించేవాడు ఉంటేనే చేసే వాళ్లు వస్తారు, వాళ్లంతట వారుగా ఎవరూ వెళ్లరు.... అని తమ్మారెడ్డి అననారు.

  ఆ సెటప్ చేసేదంతా వారే...

  ఆ సెటప్ చేసేదంతా వారే...

  చేయించేవాడు బ్రోకర్లను పట్టుకుని, ఆ బ్రోకర్లు పార్టీలను పట్టుకుని వీరికి ఒక రూమ్ బుక్ చేసి ఇదంతా చేస్తేనే అమెరికాలో వ్యభిచారం అనేది సాధ్యం అవుతుంది. అందుకే ఇలాంటి నీచమైన పనులు చేసే వారు కాదు, ఇలాంటి పనులు చేయించే వారు సిగ్గుపడాలి... అని తమ్మారెడ్డి తేల్చిచెప్పారు.

  English summary
  STOP Prostitution & Don't blame TFI / Telugu Film Industry says Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He speaks about Tollywood s*x racket run by Indian-origin couple in the USA shook the Telugu film industry and new details about the victims and those who participated on the mutual agreement are now coming out of the woodworks. Finally, he says ignore the rumors about Celebs and a lot of innocent heroines also faced a tough time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more