»   » పవన్ కళ్యాణ్ పంచె కట్టు కారణం అదే, నెల పాటు అంతే?

పవన్ కళ్యాణ్ పంచె కట్టు కారణం అదే, నెల పాటు అంతే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో గత కొంత కాలంగా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పోలీస్ డ్రెస్సులోనే కనిపించే వారు. ఆ మధ్య చిరంజీవిని కలిసేందుకు వచ్చిన సందర్భంలోనూ, మరో సందర్భంలో మీడియాతో మాట్లాడినపుడు ఆయన పోలీస్ డ్రెస్సులోనే కనిపించారు.

అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబుతో బేటీ అయిన సందర్భంలో పంచె కట్టుతో కనిపించారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన ప్రత్యేకంగా పంచె కట్టలేదని, వాస్తవానికి ఆయన పంచె కట్టు వెనక మరో కారణం ఉందని అంటున్నారు. పవన్ ఇంట్లో కార్తీక మాసం పూజలు మొదలయ్యాయని, గురువారం ఉదయం ఇంట్లో జరిగిన కార్తీక మాసం పూజలకోసం పవన్ మన సంప్రదాయానికి తగ్గట్టుగా తెల్లదుస్తులు ధరించారు. అవే దుస్తుల్లోనే విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిసారట.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కార్తీకమాసం పూర్తయ్యేవరకు పవన్ కళ్యాణ్ ఒంటిపూట భోజనమే చేస్తారని తెలుస్తోంది. ఈ నెల రోజులపాటు పవన్ ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయని సమాచారం.

 Pawan Kalyan Panche Kattu

పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ విశేషాల్లోకి వెళితే...

పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' లో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఖరారైనా ఇప్పటి వరకు ఆమె షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదు చిత్ర యూనిట్. మధ్యలో ఆమె రెండు సార్లు షూటింగ్ సెట్స్ కు కూడా వచ్చి వెళ్లింది. అయినా ఆమెకు ఇంకా షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదు. ఇటీవలే ఆమెకు పవన్ కళ్యాణ్ నుండి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.

నవంబర్ 17 నుండి ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి షూటింగులో పాల్గొనబోతోంది. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ గుజరాత్ లోని వడొదరాలో జరుగుతోంది. తనకు షూటింగ్ నిమిత్తం పిలుపు రావడంతో ఇంతకాలం కాస్త టెన్షన్ పడ్డ ఆమె రిలాక్స్ అయిందని సమాచారం. కాజల్ ఇప్పటి వరకు మరే ఇతర పెద్ద సినిమాలకు కమిట్ కాలేదు. అయితే మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం'లో మాత్రం ఆమె ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కోస్టార్స్ షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ఎంజాయ్ చేస్తూ శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటిక బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన సెల్పీని తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Janasena party President Pawan kalyan in New looks. He came to Vijayawada in Pancha kattu.
Please Wait while comments are loading...