»   »  సిద్దార్ద మీదా ఎటాక్..భయపడతాడా?

సిద్దార్ద మీదా ఎటాక్..భయపడతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ్ లో సుందర్.సి దర్శకుడిగా తెరకెక్కించిన హారర్ చిత్రం 'అరణ్మనై' .. చిత్రం గతంలో తెలుగులో 'చంద్రకళ' పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దాంతో అదే ఉత్సాహంతో ఈ దర్శకుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'అరణ్మనై 2' ను రూపొందించాడు. ఇప్పుడు ఈ సినిమాని 'కళావతి' టైటిల్ తో ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు.

Story or Siddardha's Kalavathi movie

ఈ చిత్రం కథలో జమీందార్ (రాధారవి) తను ఉంటున్న గ్రామంలో కుంభాభిషేకం ప్లాన్ చేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న జనాలు నమ్మకం ఏమిటంటే..కుంభాభిషేకం జరిగితే దేముడు కన్ను తెరుస్తాడని, దాంతో ఊళ్లో ఉన్న దుష్ట శక్తి అనేది పారిపోతుందనీను. దాంతో భారీ ఎత్తున కుంభాభిషం కు ప్లాన్ చేస్తారు. అయితే ఊహించని ట్విస్ట్ వచ్చి పడుతుంది.ఏర్పాట్లు పూర్తయ్యే సరికి ఓ దుష్టశక్తి జమీందారు కోటలోకి ప్రవేశించి ఆయన్ను చంపటానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోతాడు. ఈ సంఘటనతో ఆయన బంధువులు అంతా అక్కడకి వస్తారు. వాళ్ళతో పాటు ఆ జమీందారు కుమారుడు మురళి(సిద్దార్) కూడా వస్తాడు.


Story or Siddardha's Kalavathi movie

అతనితో పాటు అనిత(త్రిష) కూడా ఆ భవంతికి వస్తుంది. అయితే అసలు ఈ మిస్టరీ ఏమిటీ అని ఛేదిస్తూంటే..దీని వెనక ..అనిత సోదరి కళ(హన్సిక) ఉందని , ఆమె చనిపోయిందని బయిటపడుతుంది. ఈలోగా కళ ఆత్మ...సిద్దార్ధని, త్రిషను కూడా చంపటానికి ప్రయత్నిస్తుంది... ఇంతకీ కళ ఎవరు...ఆమె ఎందుకు చనిపోయింది..కుంభాభిషేకం జరిపారా అనేది మిగతా సినిమా .


English summary
Sundar C. came up with the sequel to Chandrakala film, Kalavathi starring Siddharth, Trisha and Hansika. The movie is releasing today with good buzz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu