»   »  కమెడియన్ వేణు పోగొట్టుకుంది అభిమాని ద్వారా తిరిగి వచ్చింది

కమెడియన్ వేణు పోగొట్టుకుంది అభిమాని ద్వారా తిరిగి వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు కమెడియన్.... వేణు వారంరోజుల క్రితం తన పర్సును ఎక్కడో పొగొట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఇలాంటివి వెనక్కి రావడం కష్టం. ఆశలు వదులుకోవాల్సిందే. అయితే వేణుకు మాత్రం తన అభిమాని కారణంగా తన పర్సు తనకి చేరుకుంది.

Stranger Found Comedian Venu's Purse On Road

వేణు పొగొట్టుకున్న పర్సు ఫణి అనే వ్యక్తికి దొరికింది. అతను వెంటనే వేణు ఫోన్‌ నంబర్‌ కనుక్కొని పర్సు అందించారు. ఈ విషయం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వేణు... మనం ఎంత మంచిగా ఉంటే దేవుడూ మనకు అంత మంచి చేస్తాడు అని రాశారు. పర్స్‌ తెచ్చిచ్చిన ఫణికి కృతజ్ఞతలు తెలుపుతూ అతనితో తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు.


వేణు గురించిన ఇతర వివరాలలోకి వెళితే... ప్రస్తుతం టాలీవుడ్ బాగా డిమాండ్ ఉన్న కమెడియన్లలో వేణు ఒకరు. అటు సినిమాలతో పాటు జబర్దస్త్ లాంటి టీవీ కామెడీ షోలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వేణుకు దాదాపు 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
English summary
One of the well-known Jabardasth comedian Venu, who shot to fame with the film Munna, has took a surprise on Facebook today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu