»   » సుబ్బిరామిరెడ్డితో శ్రీదేవి మాట్లాడిన ఆఖరి మాటలు, ఆస్తుల గురించి.. బ్లెస్ చేయండి సార్..!

సుబ్బిరామిరెడ్డితో శ్రీదేవి మాట్లాడిన ఆఖరి మాటలు, ఆస్తుల గురించి.. బ్లెస్ చేయండి సార్..!

Subscribe to Filmibeat Telugu

రాముడిని తెలుగువారు ఎన్టీఆర్ రూపంలో చూసారు.. దివినుంచి భువికి దిగివచ్చిన దేవకన్య అంటే మాత్రం జ్ఙాపకం వచ్చేది శ్రీదేవి. ఈ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెండి తెరపై దేవకన్యకు నిలువెత్తు రూపం శ్రీదేవి. ఆ అతిలోక సుందరి తుదిశ్వాస విడిచి మరలా దివికే వెళ్ళిపోయింది. భారత చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తరాల తరబడి నటులతో నటించిన అనుభవం ఆమెది. అందుకే శ్రీదేవి మరణానికి సంతాపం చెబుతూనే ఆమెతో పరిచయం ఉన్న ప్రతి సెలెబ్రిటీ శ్రీదేవిని గుర్తు చేసుకుంటున్నారు. కళాబందు టి సుబ్బిరామిరెడ్డి తాజాగా శ్రీదేవి మరణంపై స్పందించారు. శ్రీదేవి చివరగా తనతో మాట్లాడిన మాటలని ఆయన గుర్తుచేసుకున్నారు.

బాధని భరించలేకపోతున్నా

బాధని భరించలేకపోతున్నా

శ్రీదేవి మరణ వార్త విని ఆ బాధని భరించలేక పోతున్నానని సుబ్బిరామిరెడ్డి అన్నారు. శ్రీదేవి ఇక లేరంటే నమ్మలేకపోయితున్నా అని సుబ్బిరామి రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
గొప్ప ఆర్టిస్ట్, 40 ఏళ్లుగా నవ్వుతూనే

గొప్ప ఆర్టిస్ట్, 40 ఏళ్లుగా నవ్వుతూనే

శ్రీదేవి చాలా గొప్ప ఆర్టిస్ట్ అని సుభిరామిరెడ్డి కొనియాడారు.గత 40 ఏళ్ల కాలం నుంచి ఆమె నవ్వుతూనే కనిపిస్తున్నారని ఆయన అన్నారు. ఒకేలా ఉండగలగడం ఆమె గొప్పతనం అని ఆయన వివరించారు.

చెన్నైలో ఇప్పటికి

చెన్నైలో ఇప్పటికి

తనతో శ్రీదేవి ఈ మధ్యనే చివరగా మాట్లాడారని సుబ్బిరామిరెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి అప్పట్లో చెన్నైలో ఉండేవారు. ఆ సమయంలో ఆమె కొన్ని ఆస్తులని సంపాదించారు. అవి ఇప్పటికి అలాగే ఉన్నాయి. వాటి గురించి శ్రీదేవి తనతో ఈ మధ్యనే మాట్లాడారని సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆ ఆస్తులని తన పిల్లలకు అందించాలని, ఆ విషయంలో సాయం చేయమని తనని కోరినట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు .

తొలిసారి అప్పుడే చూశా

తొలిసారి అప్పుడే చూశా

1973 లో వచ్చిన ఎన్నార్ చిత్రం భక్త తుకారాం సినిమా అందర్భంగా శ్రీదేవిని తాను తొలిసారి చూశానని సుబ్బిరామి రెడ్డి తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవి చాలా చిన్న అమ్మాయి.

తల్లితో కలసి వచ్చింది.. మా ఇంట్లోనే భోజనం

తల్లితో కలసి వచ్చింది.. మా ఇంట్లోనే భోజనం

భక్త తుకారాం సినిమా సమయంలో శ్రీదేవి తన తల్లిని తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆ రోజు వారు మా ఇంట్లోనే భోజనం చేసారని సుబ్బిరామిరెడ్డి గుర్తు చేసుకున్నారు.

 దీవించండి సార్

దీవించండి సార్

ఆ మధ్యన ఒకానొక సందర్భంలో శ్రీదేవి తనతో మాట్లాడుతూ.. మా కూతురిని హిరోయిన్ చేయాలని అనుకుంటున్నా.. దీవించండి సార్ అని తనని అడిగినట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. తన దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెప్పానని అయన అన్నారు.

భారత సినిమాని ఏలిన ఏకైక తార

భారత సినిమాని ఏలిన ఏకైక తార

సాధారణంగా కొందరు హీరోయిన్లు కొన్ని చిత్ర అపరిశ్రమలకు మాత్రమే పరిమితం అవుతారు. సౌత్ రాణించిన వారు నార్త్ లో రాణించలేకపోవచ్చు. అక్కడ రాణించిన వారు ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేకపోవచ్చు. కానీ శ్రీదేవి మాత్రం భారతీయ సినిమా మొత్తంపై తన అసమానమైన ప్రతిభని చాటి కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. శ్రీదేవి మరణంతో భారతీయ సినీలోకం శోకంలో మునిగిపోయింది.

English summary
Subbarami Reddy remembers Sridevi last words. He shocked with Sridevi death news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu