»   » ‘సుబ్రమ్మణ్యం ఫర్ సేల్’రన్ టైం లాక్ చేసారు

‘సుబ్రమ్మణ్యం ఫర్ సేల్’రన్ టైం లాక్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుబ్రమ్మణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉండేట్లు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


'Subramanyam For Sale' run time 2 hours and 30 min

ఇప్పటికే 'పిల్లా నువ్వు లేని జీవితం', ‘రేయ్' సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ '. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని తాను పైకి రావాలనుకోవడం లేదని, సొంత గుర్తింపు తెచ్చుకుంటానని సాయి ధరమ్ తేజ్ అంటున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని కావడం వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయనేది నిజమే అయినప్పటికీ, తన పనిని బట్టే ప్రేక్షకులు ఆదరిస్తారని, నటన విషయంలో న్యాయ నిర్ణేతలు వారేనని అన్నారు.


సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌ ఎస్‌.

English summary
'Subramanyam For Sale', starring Sai Dharam Tej and Regina in the leads, is all set for a release on 24th of September. The runtime of the film is 2 hours and 30 minutes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu