For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేనల్లుడి సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి సందడి (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై పాటల్ని ఆవిష్కరించారు.

  ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి 150వ సినిమా గురించి అడగటంతో ఆయన మాట్లాడుతూ ''ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే కథని తీసుకురండి. అలాంటి కథతో వచ్చినవాళ్లు ఎవరైనా నా 150వ సినిమాకి దర్శకుడు కావొచ్చు'' అన్నారు. అభిమానుల మధ్యకి వచ్చినప్పుడు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోను. ఎనిమిదేళ్లుగా నేను నటించడం లేదేమో కానీ సినిమాకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నా. మా ఇంట్లో కథానాయకుల చిత్రాలకి సంబంధించిన కథల్ని వింటూ వాళ్ల చిత్రాల్ని చూస్తూ సినిమాతో మమేకం అవుతున్నా. 150వ సినిమా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు మంచి కథతో వస్తారో అని ఎదురు చూస్తున్నా. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' వేడుకలో మరోసారి నా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఆడియో వేడుక ఫోటోస్...

  హరీష్ శంకర్ గురించి

  హరీష్ శంకర్ గురించి


  దర్శకుడు హరీష్‌శంకర్‌ తీసిన 'గబ్బర్‌సింగ్‌'కి నేను పెద్ద అభిమానిని. అందులో నటించిన పవన్‌కల్యాణ్‌ ఎంత నా తమ్ముడైనా నాలోనూ ఓ నటుడు ఉంటాడు కదా అందుకే ఇలాంటి సినిమా కదా నాకు కావాల్సింది, ఇలాంటి దర్శకుడు కదా నాక్కావాల్సింది అనిపించింది.

  దిల్ రాజు గురించి

  దిల్ రాజు గురించి


  దిల్‌రాజు అన్ని శాఖలపై పట్టున్న నిర్మాత. 'మీతో ఓ సినిమా తీయాలని ఉంది, అవకాశమిస్తారా' అని నన్ను ముందు అడిగాడు కానీ నిజానికి నేనే ఆయన్ని 'నాతో ఓ సినిమా చేయండి అని అడుగుదామనుకొన్నా'.

  సినిమా గురించి..

  సినిమా గురించి..


  'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' కథ వింటుంటే నేను నటించిన 'మొగుడు కావాలి', 'బావగారూ బాగున్నారా' గుర్తుకొచ్చాయి. రెజీనా బాగా నటించింది. అభిమానులు ఎప్పుడూ మాపై ప్రేమని కురిపిస్తూనే ఉన్నారు. వాళ్లకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంద''న్నారు.

  సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ '

  సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ '


  చిరంజీవి మావయ్య వేడుకకి రావడం ఆనందాన్నిచ్చింది. నటుడిగా నాకు బొమ్మరిల్లు సంస్థ జన్మనిస్తే దిల్‌రాజు సంస్థ ఆ నటుడిని చేయి పట్టుకొని నడిపిస్తోంది. దర్శకుడు హరీష్‌శంకర్‌ ఒక అన్నయ్యగా నాకు అండగా నిలిచారు. మిక్కీ జె.మేయర్‌ పాటలు బాగున్నాయి. రెజీనాతో కలిసి మరోసారి నటించడం మంచి అనుభవం'' అన్నారు.

  దిల్‌రాజు మాట్లాడుతూ

  దిల్‌రాజు మాట్లాడుతూ


  హరీష్‌ శంకర్‌ స్త్టెల్‌ కథకి, కుటుంబ వాతావరణాన్ని జోడించి ఈ సినిమా తీశాడు. 'పిల్లా నువ్వు లేని జీవితం' మొదలుకొని వరుసగా సాయిధరమ్‌తేజ్‌తో సినిమాలు చేస్తున్నాం. తన నాలుగో సినిమాని అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మించబోతున్నాం. పవన్‌కల్యాణ్‌కు 'తొలిప్రేమ'లా తేజూకి ఈ సినిమా అలా ఉంటుంది. చిరంజీవిగారితో ఒక సినిమా చేయాలని ఉంది. పవన్‌కల్యాణ్‌గారు ఇటీవలే సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు కథ గురించి, దర్శకుడి గురించి చూస్తున్నాం'' అన్నారు.

  హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ...

  హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ...


  తేజూని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లా చూపించారని అంటున్నారు. కొత్తగా మేం చూపించిందేమీ లేదు, తను అలాగే ఉన్నాడు. క్రమశిక్షణలోనూ, కష్టపడటంలోనూ తేజూకి మేనమామల పోలికలే వచ్చాయి. 'గబ్బర్‌సింగ్‌' సినిమా తీస్తున్న సమయంలో పవన్‌కల్యాణ్‌గారి ఇంట్లో తేజూ కనిపించాడు. అప్పుడే నాకు సుబ్రమణ్యం దొరికాడనిపించింది. కొన్ని కథలు కొద్దిమందిని వెదుక్కొంటాయన్నట్టు... నా కథ సాయిధరమ్‌ తేజ్‌ని వెతుక్కొంద''న్నారు.

  English summary
  Subramanyam For Sale Movie Audio Launch event held at Hyderabad. Chiranjeevi, Actor Sai Dharam Tej, Actress Regina Cassandra, Director Harish Shankar, Dil Raju, Mickey J Meyer, Tejaswi Madivada, Chandrabose, Gopichand Malineni, Vijaya Naresh, Pragathi, Vamsi Paidipally, Bandla Ganesh, Rao Ramesh, Gautham Raju and others graced the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X