»   » సుచీ లీక్స్: ఫ్యాన్స్‌కి ఏం చేప్పాలో తెలియక ఏడుస్తున్న చిన్మయి!

సుచీ లీక్స్: ఫ్యాన్స్‌కి ఏం చేప్పాలో తెలియక ఏడుస్తున్న చిన్మయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సుచీ లీక్స్ వ్యవహారం పలువురు సౌత్ సినీ సెలబ్రిటీపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. ఈ వ్యవహారం తన భార్యను ఎంతో బాధించిందని, తనపై వచ్చిన ఆరోపణలపై ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోతూ ఏడోస్తోందని ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తెలిపారు. ఈ వ్యవహారం తన జీవితాన్ని ఎంతో డిస్ట్రబ్ చేసిందన్నారు.

ఈ పరిణామాలు చిన్మయిని చాలా అప్ సెట్ చేసాయి. చాలా డిస్ట్రబ్డ్ గా ఉంటోంది. తనపై పడిన నిందలను గుర్తు చేసుకుని ఏడుస్తోంది. తాను ఈస్థాయికి రావడానికి, ఇన్ని పేరే ప్రతిష్టలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. ఒక్కసారిగా అదంతా కుప్పకూలిపోయేలా తీవ్రమైన ఆరోపణల రావడం ఆమె తట్టుకోలేక పోతోంది అని రాహుల్ రవీంద్రన్ అన్నారు.

చిన్మయి

చిన్మయి

చాలా మంది తనపై వస్తున్న ఆరోపణలు నిజమే అని నమ్ముతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో విషయం గురించి పదే పదే అడుగుతున్నారు. త్వరలో అనిరు-చిన్మయి వీడియో రిలీజ్ అవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూసి చిన్మయి ప్రశాంతంగా ఉండలేక పోతోందట.

భర్త రాహుల్ రవీంద్రన్

భర్త రాహుల్ రవీంద్రన్

జరుగుతున్న పరిణామాలపై తాము స్టోవిక్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నాం. సింగర్ సుచి(సుచిత్ర) జీవితం మరింత ఇబ్బందుల్లోకి వెళ్లకూడదనే ఈ మౌనం. కానీ మా మౌనాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నారు అని రాహుల్ రవీంద్రన్ ఆవేదన వ్యక్తం చేసారు.

పెళ్లి ముందు అబార్షన్లు

పెళ్లి ముందు అబార్షన్లు

పెళ్లికు ముందు నాలుగు అబార్షన్ లు చేసుకున్నావ్. డాక్టర్ రిపోర్ట్లు సహా నా దగ్గర ఆధారాలు వున్నాయి బయటపెట్టమంటావా? అంటూ ఇటీవల ట్విట్టర్ ద్వారా సుచిత్ర చిన్మయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సుచిత్ర మానిసక స్థితి

సుచిత్ర మానిసక స్థితి

సుచిత్ర మానసిక స్థితి బాగోలేకనే తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, ఆమె భర్త కార్తీక్ తో మాట్లాడమని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు నమ్మకంతో ఉన్నారు.

English summary
"Chinmayi is very upset about the happenings. For a few hours she's okay, but something will trigger it and shell start crying again. She has worked so hard to build all this. What's the point she asks, if all it takes is a bunch of tweets for so many people to start believing the allegations to be true", said Rahul Ravindran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu