twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారిలా చేశావ్.....ఇదేం బుద్ది? సింగర్-హీరోయిన్ సిగపట్లు!

    By Bojja Kumar
    |

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'పద్మావత్' చిత్రం అడ్డంకులన్నీ తొలగించుకుని జనవరి 25న గ్రాండ్‌గా విడుదలైంది. రాణి 'పద్మావతి' చరిత్రను దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడనే ప్రశంసలు సినీ విమర్శకుల నుండి వచ్చాయి. అయితే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మాత్రం దర్శకుడి తీరును తప్పుబట్టింది. అయితే స్వర భాస్కర్ కామెంట్లను తప్పుబడుతూ ఓ లేడీ సింగర్ రంగంలోకి దిగింది. ఇద్దరూ ట్విట్టర్లో సిగపట్లు పట్టుకున్నారు.

    ''మహిళా చైతన్యం ఎన్నడు లేని రీతిలో దేశంలో ముందడుగు వేస్తుంటే భన్సాలీ మాత్రం మనల్ని శతాబ్దాలు వెనక్కు తీసుకువెళ్ళి స్త్రీకి శీలం తప్ప జీవితంలో ఇంకేది లేదనే విధంగా చూపిస్తున్నారని, ఏనాడో సమిసిపోయిన 'జౌహర్' (శత్రువులకు చిక్కకుండా రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం) అంత గొప్పగా చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటి తరానికి అవసరం లేని ఇలాంటి కథలను సినిమాలుగా తీసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?'' అంటూ నటి స్వర భాస్కర్ మండి పడింది.

    స్వర భాస్కర్‌కు కౌంటర్ ఇచ్చిన లేడీ సింగర్

    స్వర భాస్కర్‌కు కౌంటర్ ఇచ్చిన లేడీ సింగర్

    అయితే స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి తప్పుబట్టారు. స్వర భాస్కర్ పోషించిన ఎరోటిక్ డాన్సర్, వేశ్య పాత్రలను టార్గెట్ చేస్తూ ఆమెను ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

    వేశ్యగా చేసిన నువ్వా.... ఫన్నీ

    సినిమాల్లో వేశ్య పాత్రలు, శృంగార నృత్యాలు చేసే ఓ నటి..... గౌరవప్రదమైన రాణి పద్మావతి గురించి తీసిన సినిమా గురించి తప్పుడు కూతలు కూసింది. ఇదేం బుద్ది? అంటూ.... సుచిత్రా కృష్ణమూర్తి ట్విట్టర్ ద్వారా గట్టిగానే చురకలు అంటించింది.

    సింగర్‌కు కౌంటర్ ఇచ్చిన స్వర భాస్కర్

    అయితే స్వర భాస్కర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆమెకు కౌంటర్ ఇచ్చింది. నేను చేసిన వ్యాఖ్యల్లో విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒక పదాన్ని పట్టుకుని రాద్దాంతం చేస్తున్నావంటూ ఎదురుదాడి చేసింది.

    పద్మావతి సినిమా మాత్రమే...

    ‘పద్మావత్' అనేది చరిత్రలో జరిగిన ఒక కథ మాత్రమే. దాన్ని తెరపై చూపించారు. అందులో చూపించిన విషయాలు ప్రజలు ఫాలో అవ్వాలనే చెప్పలేదు. ఫెమినిస్ట్ డిబేట్స్ పెట్టేందుకు తగిన అంశం ‘పద్మావత్' సినిమా కాదు, సినిమాను సినిమాగా చూడు.... అంటూ సింగర్ సుచిత్ర కౌంటర్ ఇచ్చారు.

    పద్మావత్

    పద్మావత్

    దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లావుద్దీ‌న్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు.

    13వ శతాబ్దం నాటి కథ

    13వ శతాబ్దం నాటి కథ

    13వ శతాబ్దంలో రాజస్థాన్‌లో చిత్తోర్ కోటలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘పద్మావత్' చిత్రం తెరకెక్కింది. చిత్తోర్ మహారాని పద్మావతి గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. రూ. 200 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కింది.

    English summary
    Singer Suchitra Krishnamoorthi has criticised Swara Bhaskar for the tone and crux of her article. The singer questioned Swara’s opinion pointing out that the actress essayed an “erotic dancer/prostitute” in films in the past. Swara, who has been vocal about several issues and has worked with Bhansali in Guzaarish, voiced her opinion via an open letter calling out the filmmaker for glorifying Sati and Jauhar in his film and said that she felt reduced to a vagina by the end of it. On Sunday, Suchitra tweeted: “Funny that an actress who can play an erotic dancer/prostitute with such elan should feel like a vagina after watching a story of a pious queen. What standards are these ...tch tch (sic).”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X