»   » వివాదం: మరోసారి ట్విట్టర్లో చెలరేగిన ఎంఎం కీరవాణి, సెటైర్లు...

వివాదం: మరోసారి ట్విట్టర్లో చెలరేగిన ఎంఎం కీరవాణి, సెటైర్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే రోజు.... ట్విట్టర్ ద్వారా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేను నా కెరీర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు.... అని కీరవాణి సంచలన కామెంట్స్ చేసారు.

అంతే కాకుండా వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది... అంటూ గీత రచయితలపైనా ట్వీట్స్ చేసారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీరవాణిపై ఎదురుదాడి కూడా మొదలైంది. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్‌లు కీరవాణిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దీంతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా కీరవాణి తీరును తప్పుబట్టారు. కీరవాణి ఇలా మాట్లాడాల్సి ఉంది కాదు అని అభిప్రాయ పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీరవాణి మరోసారి సోమవారం తన ట్విట్టర్ కు పని చెప్పారు. వరుస ట్వీట్లు చేసారు. తనపై విమర్శలు చేసిన వారిపై వ్యంగాస్త్రాలు సంధించారు.

ఆ ట్వీట్స్ తొలగించానన్న కీరవాణి

ఒక ట్వీట్లో 'మోస్ట్లీ' అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్ తొలగించాను అని కీరవాణి తెలిపారు.

తప్పులు చేస్తుంటా

మనం ఎప్పటికీ విద్యార్థులమే .. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు. అని కీరవాణి ట్వీట్ చేసారు.

తెలివి తక్కువ వాన్ని నేనే

దర్శకులందరూ మేథావులని సడన్ గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే .. అది నేనేనేమో!

నేను పొగరుబోతునా?

ఎవరో ఒక నిఘంటువు పంపారు నాకు. అందులో పొగరుకి 'ఎమ్.ఎమ్.కె' (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను. అని కీరవాణి ట్వీట్ చేసారు.

ఓల్డ్ బ్రెయిన్ లెస్ కంపోజర్ నేనే

ఉన్న దర్శకులందరూ గొప్పవారు ప్రపంచంలో. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్ బ్రెయిన్ లెస్ కంపోజర్ ను కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా. అని కీరవాణి ట్వీట్ చేసారు.

ఐదు నిమిషాల్లో వాష్ చేసారు

కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్ వాష్ చేశారు... అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా కాబట్టే

పాటల రచయితలందరూ ఇష్టమే నాకు. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే. నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా... అందుకే వాళ్లను ఎలా మరచిపోతున్నానేమో అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

నాకు పది మార్కులే

వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

వ్యతిరేకించాను

సాయిగారు టీవీ ప్రోగ్రామ్ చూశారు ఇటీవల. ఆ ప్రోగ్రామ్లో టాలీవుడ్లో కంపోజర్స్ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్ చేశాను... అని కీరవాణి ట్వీట్ చేసారు.

చాలా తక్కువ

రైటర్స్ కొరత అధికంగా ఉంది నిజానికి. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు... అని కీరవాణి ట్వీట్ చేసారు.

అనంతర శ్రీరామ్ గురించి

అనంత శ్రీరామ్ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న నిజమైన రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

సంక్షోభంలో

తెలుగు లిరిక్స్ అంపశయ్యపై లేవు నిజమే. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు... అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

కేవలం అలాంటి వాటిటికే అనంత శ్రీరామ్

నీతి వాక్యాలు, దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్ చెప్పిన విషయాన్ని కీరవాణి గుర్తు చేసారు.

వాళ్లే రాస్తున్నారు

డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్స్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్ .. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కీరవాణి గుర్తు చేసారు.

మరి ఆయన మా బావ కదా

తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్సైడర్ కదా.

నా బావ కదా..

నేను బంధు ప్రీతిని సపోర్ట్ చేస్తాను. చంద్రబోస్గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు.... అంటూ కాస్త వ్యంగంగానే స్పందించారు కీరవాణి.

నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి

నెపోటిజమ్ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి... అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

రాజమౌళి కోపంగా ఉన్నాడు, మళ్లీ కలుద్దాం

నా మీద కోపంగా ఉన్నాడు రాజమౌళి. 'బాహుబలి -2' వర్క్ని కంప్లీట్ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28 న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా.. అంటూ కీరవాణి ముగించారు.

English summary
"Suddenly I realised that all the directors- ALL ( I emphasise ) genius and humble. It was only me the brainless all the time" Keeravani tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu