»   » కూతురికోసం ఆ స్టార్ హీరో విడాకులు రద్దు చేసుకున్నాడు

కూతురికోసం ఆ స్టార్ హీరో విడాకులు రద్దు చేసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన భార్య నుంచి విడాకులు తీసుకునే ఆలోచనను విరమించుకున్నట్టుగా ఆయన కోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు సుదీప్‌తో పాటు అతని భార్య కూడా బెంగళూరు ఫ్యామిలీ కోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక నుంచి తామిద్దరం కలిసే జీవిస్తామని వారు తెలిపారు. దీంతో వారి విడాకుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

దాదాపు రెండేళ్ల కిందట సుదీప్, ఆయన భార్య ప్రియ లు విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కారు. పద్నాలుగేళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుని వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.

Sudeep not to divorce wife?

విచారణకు సుదీప్ హాజరు కాకపోవడంతో.. వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సుదీప్, ప్రియలు మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. తమ కూతురు శాన్వీ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఈ దంపతులు కోర్టుకు తెలియజేశారు.

తామిద్దరం కలిసే ఉండాలని అనుకుంటున్నామని కోర్టుకు తెలియజేస్తూ.. విడాకుల పిటిషన్ ను వెనక్కు తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. వీరి నిర్ణయాన్ని కోర్టు స్వాగతించింది. విడాకుల పిటిషన్ ను కొట్టివేసింది. భార్య కోరినట్టుగా విడాకులు ఇచ్చి, భారీ స్థాయిలో భరణాన్ని ఇవ్వడానికి కూడా సుదీప్ సిద్ధమయ్యాడని.. అయితే కూతురి కోసం వాళ్లిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని.. ఆ హీరో తరఫు లాయర్ వివరించారు.

English summary
According to New Reports, the two have decided to give their marriage another go and live together again for the sake of their daughter, Sanvi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu