»   » పవన్ పొరపాటు..రిపీట్ చేయడంట

పవన్ పొరపాటు..రిపీట్ చేయడంట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ని అభిమానులుగా అభిమానించి అనుసరించేవారు ఉండటం చూసాం. ఇప్పుడు ఈగ విలన్ సుదీప్..కెరీర్ పరంగా పవన్ కెరీర్ గ్రాఫ్ ని ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా కన్నడంలో పవన్ చిత్రం అత్తారింటికి దారేది రీమేక్ చేసిన సుదీప్ మరో పవన్ రీమేక్ పై దృష్టి పెట్టారు.

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించి, విమర్శల ప్రశంసలు అందుకున్న ఓ మైగాడ్ కు రీమేక్ గా రూపొందిన గోపాల గోపాల చిత్రాన్నికన్నడంలో రీమేక్ చేయాలని నిర్ణయంచుకున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటీ అంటే పవన్ తెలుగులో వేసిన కృష్ణుడు పాత్రను కన్నడంలో సుదీప్ పోషించటం లేదు. వెంకటేష్ చేసిన గోపాల పాత్రను పోషించనున్నారు.

Sudeep picks Pawan Kalyan's Gopala Gopala

ముకుందా మురారి టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో ఫన్ తో సిద్దం చేస్తున్నారు. త్వరగా షూటింగ్ చేసి అబిమానులకు అందించాలని సుదీప్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా సుదీప్ ఇక్కడ తెలుగులో పవన్ సినిమాలపై దృష్టి పెడుతున్నారన్నమాట.

తెలుగులో గోపాల గోపాల చిత్రం అనుకున్న స్దాయిలో విజయం సాధించలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అనుకుని వస్తే ఆయన గెస్ట్ రోల్ లో కనిపించినట్లైంది. దాంతో ఫ్యాన్స్ నిరాస చెందారు. అలాంటి పొరపాటు కన్నడంలో జరగకూడదని సుదీప్ భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

English summary
"Gopala Gopala" film will be remade in Kannada now as "Mukunda Murari". Sudeep is now playing Pawan's role but only Venky's role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu