For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఈగ' రూపంలో వినాయకుడు, రాజమౌళి పుణ్యమే

  By Srikanya
  |

  బెంగుళూరు: రాజమౌళి తాజా చిత్రం ఈగ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేరణతో ఓ గణేష విగ్రహాన్ని రూపొందించారు. దాన్ని సుదీప్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసారు. దాని గురించి సుదీప్ ట్వీట్ చేస్తూ...హ..హ..హ..భగవంతుడుని కూడా ఎస్.ఎస్ రాజమౌళి మార్చేసారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు..లవ్ డ్ దిస్ స్పెషల్లీ డిజైనెడ్ గణేష...అన్నారు. ఈ ఫోటో నెట్ లో చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇక సుదీప్ సైతం ఈగ పుణ్యమా అని తమిళ,తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆయనకు తమిళంలో విలన్ గా ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో ఆయన చేసిన కన్నడ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించింది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ' గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

  ఇత 'ఈగ' కలెక్షన్స్ విషయానికి వస్తే..రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల అయిన సంగతి తెలిసిందే. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా వారు రైట్స్ తీసుకున్నారు. అక్కడ ఈ చిత్రం మూడో వారానికి కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 200 స్క్రీన్స్ తో విడుదలైన ఈ చిత్రం నాలుగోవారానికి కూడా 180 స్క్రీన్స్ లో రన్ అవుతోంది.

  ఈగ' సూపర్ హిట్,కలెక్షన్స్ లో మగధీరను దాటింది,గబ్బర్ సింగ్ ని బీట్ అవుట్ చేస్తోంది అంటూ మీడియా ఎంతగా ప్రచారం చేసినా వీకెండ్ లలో తప్ప కలెక్షన్స్ కనపడటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓ ప్రముఖ దిన పత్రిక విశ్లేషణ ప్రకారం 'ఈగ' ఓపినింగ్స్ అదరకొట్టినా,తర్వాత మీడియా హంగామేనే ఎక్కువ కలెక్షన్స్ తక్కువ. సురేష్ బాబు ఎంతలా కలెక్షన్స్ గురించి,అద్బుత విజయం అంటూ ఊదరకొట్టినా 'ఈగ'టార్గెట్ రీచ్ కాలేదని వినికిడి. ముఫై కోట్ల దగ్గర దగ్గర ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా అన్ని రైట్స్ మొత్తం కలిపి బ్రేక్ ఈవెన్‌కు చేరిందని వినిపిస్తోంది.

  English summary
  Hahaha....loved this specially designed Ganesha....never before...looks like SS Rajamouli has changed the look of the lord too... Sudeep via Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X