»   » అభిమాన హీరోని కౌగిలించుకొని - ఆనందం తో గుండె ఆగి., విషాదం

అభిమాన హీరోని కౌగిలించుకొని - ఆనందం తో గుండె ఆగి., విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ స్టార్ హీరో సుదీప్‌ నటించిన 'హెబ్బులి' చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.ఈగ విలన్ గా మనకు పరిచయమైన కన్నడ స్టార్ సుదీప్ హాస్పీతల్ లో చేరాడు. బాహుబలి లోనూ కనిపించిన సుదీప్ ఇప్పుడు కన్నడలో హీరో గా "హెబ్బులి" చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కమెండో పాత్రలో కనిపించాడు. పాత్ర కోసం సరికొత్త కాస్ట్యూమ్స్‌తో వెరైటీ హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపిస్తున్న సుదీప్ సరికొత్త లుక్ ఇప్పుడు కర్ణాటక ని ఒక ఊపు ఊపేస్తోంది. . ఈ చిత్రంలో సుదీప్ సరసన అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా విజయోత్సవం లో భాగంగా అభిమానులని నేరుగా కలుసుకునేందుకు బయల్దేరాడు కిచ్చా... ఒక్కొక్క జిల్లాలోనూ అభిమానులను పలకరిస్తూ వారితో మాట్లాడుతూ సాగుతున్న ఈ యాత్రలో ఊహించని విధంగా విషాదం చోటు చేసుకుంది.

Sudeep Shocked Over Sudden Death Of His Fan

తమకూరు జిల్లా కేంద్రం తుమకూరులోని గాయత్రీ చిత్రమందిరంలో సోమవారం సుదీప్‌ను చూడడానికి పట్టణానికి చెందిన ఓ హోటల్‌ యజమాని కె.జె.రుద్రప్ప ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. రుద్రప్ప చూపించిన అభిమానానికి స్పందించిన సుదీప్‌..రుద్రప్పను ఆలింగనం చేసుకుని అభినందించారు.

అయితే తన అభిమాన హీరో అంతగా రియాక్ట్ అవటం ఊహించనిది కావటం తో రుద్రప్ప ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఆ ఎక్సైట్ మెంట్ లో వూపిరి ఆడడం కష్టమై అక్కడికక్కడే పడిపోయాడు. సుదీప్‌ అభిమానులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచనతో బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సుదీప్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

English summary
Rudrapaa who is a big fan of Sudeep managed to meet him, and Sudeep also gave a warm welcome to the fans and hugged him. Out of extreme happiness, the fan left his life
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu