»   » సుదీప్ ‘అత్తారింటికి దారేది’...రాజమౌళికి థాంక్స్

సుదీప్ ‘అత్తారింటికి దారేది’...రాజమౌళికి థాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పటి వరకు కన్నడ చిత్ర సీమకు మాత్రమే పరిమితమైన కన్నడ నటుడు సుదీప్.....'ఈగ' చిత్రం ద్వారా తెలుగు, తమిళం, హిందీలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల సుదీప్ తెలుగు హిట్ మూవీ 'మిర్చి' కన్నడ రీమేక్‌లో నటించాడు. దర్శకుడు కూడా అతడే. ప్రస్తుతం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ఈ సంతోష సమయాన్ని పురస్కరించుకుని సుదీప్ ట్విట్టర్ ద్వారా దర్శకుడు రాజమౌళికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. తనతో పాటు పని చేసిన అందరు ఫిల్మ్ మేకర్స్‌ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని సుదీప్ చెప్పుకొచ్చారు.

Sudeep thanks to Rajamouli

'మిర్చి' కన్నడ రీమేక్‌తో సక్సెస్ కొట్టిన సుదీప్....మరో తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ పోషించబోతున్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Special tnxx to ssrajamouli sir for these magical moments in my life n to all the film makers in my life fr makin it possibl.. Luv u all</p>— Kichcha Sudeepa (@KicchaSudeep) <a href="https://twitter.com/KicchaSudeep/statuses/468317080354172928">May 19, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మించబోతున్నారు. సుదీప్ సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు? అనేది తేలాల్సి ఉంది. తెలుగులో ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

English summary
“Special tnxx to ssrajamouli sir for these magical moments in my life n to all the film makers in my life fr makin it possibl.. Luv u all” tweeted Sudeep.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu