»   » నేడే రిజల్ట్: చిరంజీవి వల్ల కాలేదు, ఇతని వల్ల అవుతుందా?

నేడే రిజల్ట్: చిరంజీవి వల్ల కాలేదు, ఇతని వల్ల అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ ఈ ట్యాగ్ కోసం చాలామంది తెలుగుహీరోలు తపన పడ్డారు. కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్క హీరో ఆ టార్గెట్ ని అందుకోలేక పోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి సక్సెస్ కొట్టిన వాళ్లంతా శ్రీదేవీ,జయప్రద ఇలా హీరోయిన్లు మాత్రమే . తెలుగు మేల్ ఆర్టిస్టుల్లో బాలీవుడ్ లో ఎవరూ సరిగా నిలబడలేకపోయారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి - తర్వాత రామ్ చరణ్ - లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాది ప్రేక్షకులని ఆకట్టుకోలేక ఇక్కడే ఆగిపోయారు. అప్పట్లో నాగార్జున కోన్ని హిందీ సినిమాల్లో కనిపించాడు కానీ వాటితో పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పాలి.

కానీ ఇప్పుడు మరో తెలుగు నటుడు ఆ కలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఓ సూపర్ ఎఫర్ట్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటివరకూ ఇలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు భిన్నంగా.. "బాఘీ" మూవీతో విలన్ గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ ఇవాళే. ఇప్పటికే టీజర్ లు - ట్రైలర్ లతో యాక్షన్ పార్ట్ ను ఇరగదీసేయడమే కాదు.. స్పెషల్ గా సుధీర్ బాబుపైనే ఓ టీజర్ కూడా ఇచ్చారు.

sudheer baabu will become star in bollywood?

సుధీర్ బాబు ను రాఘవగా పరిచయం చేస్తున్నారంటూ ఇచ్చిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ నుంచి వచ్చింది. ఇందులో సుధీర్ బాబు లుక్ కానీ.. అతడి అప్పీయరెన్స్ కానీ అద్బుతం అనే చెప్పాలి. దీంతో టాలీవుడ్ సెలబ్రెటీలు ఇక్కడి జనాలు సుధీర్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని గంటలక్రితమే రిలీజ్ అయిన భాఘీ చిత్రం వచ్చిన అన్ని రివ్యూల్లోనూ సుధీర్ బాబు నటన పై ప్రశంసలుకురుస్తున్నాయి. ఈ సినిమా హీరో టైగర్ ష్రాఫ్ తో సమానం గా సుధీర్ బాబు మార్కులు కొట్టేశాడు.

ఇప్పటివరకూ ఉన్న హైప్ ప్రకారం చూస్తే.. బాలీవుడ్ లో అరంగేట్రంలోనే సుధీర్ బాబు సంచలనం నమోదు చేస్తాడనే అనిపిస్తోంది. హీరోగా కాకున్నా ఒక పేరున్న నటుడి గా అయినా నిలబడే అవకాశాలున్నాయి. మూవీ కోసం బాడీని భారీగా పెంచి కండలు మెలితిప్పి అత్యంత క్రూరమైన విలన్ గా కనిపిస్తూ. హిందీ సినీ పరిశ్రమలో పాగా వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. మరి రిజల్ట్ ఏమిటో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. తెలుగు హిట్ మూవీ 'వర్షం'కు రీమేక్ గా చెబుతున్న ఈ సినిమా సుధీర్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

English summary
Sudheer Babu and Tiger Shroff’s unique avatars turned the rest of the interesting part of the film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu