»   »  నిర్మాతపై, మీడియాపై సుధీర్ బాబు అసంతృప్తి

నిర్మాతపై, మీడియాపై సుధీర్ బాబు అసంతృప్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సినిమాలో కంటెంట్ లేక పోవడంతో రివ్యూలన్నీ నెగెటివ్ గానే వచ్చాయి. అయితే సుధీర్ బాబు మాత్రం మీడియా వారు కావాలనే తమపై ప్రతాపం చూపించారని ఫీలవుతున్నాడు

ప్రస్తుతం సినీ పరిశ్రమలో.....ఓ గొడవ నడుస్తోంది. కొందరు నిర్మాతలు నైజాం ఏరియాలోని ఓ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నేతృత్వంలో సిండికేటుగా ఏర్పడి కేవలం రెండు ఛానళ్లకు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మిగతా ఛానల్స్ వారు సదరు నిర్మాతల సిండికేటుపై ఆగ్రహంగా ఉన్నాయి.

సుధీర్ బాబు హీరోగా లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిలో సదరు సిండికేటులోని ఓ బడా నిర్మాత కూడా ఉన్నారు. ఈ కారణంగా మీడియా వారు కావాలని తమపై ప్రతాపం చూపించారని ఫీలవుతున్నాడు సుధీర్ బాబు.

 Sudheer Babu dissatisfaction on reviews

మరో వైపు నిర్మాతపై కూడా సుధీర్ బాబు అసంతృప్తిని వెల్లగక్కినట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో నిర్మాత జాగ్రత్తగా ఉండాలని లేకుంటే నిర్మాతకే కాదు అందులో పనిచేసిన మిగతా వారికి కూడా నష్టం ఏర్పడుతుందని అన్నారు. మీడియా వారు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఇలా మమ్మల్ని బలి చేయొద్దనే విధంగా మాట్లాడుతున్నాడు. సినిమాకెళ్లే వారు ఇప్పటికే సినిమా చూసిన వారి అభిప్రాయం తెలుసుకుని పోవాలని ఆడియన్సుకు సూచిస్తున్నాడు.

అయితే... సుధీర్ బాబు వాదనను మీడియా సర్కిల్ తప్పుబడుతోంది. సినిమాలో కంటెంటు సరిగా లేనపుడు రివ్యూలు అలానే ఉంటాయి. లేనిపోనివి ఊహించుకుని మాపై దుమ్మెత్తి పోయడం ఏమిటని రివర్స్ పంచ్ లు వేస్తున్నారు.

English summary
Sudheer Babu dissatisfaction on Mosagallaku Mosagadu Reviews.
Please Wait while comments are loading...