»   »  పుల్లెల గోపీచంద్ గా మహేష్ బాబు బావ

పుల్లెల గోపీచంద్ గా మహేష్ బాబు బావ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన స్నేహితుడు, ప్రముఖ బాడ్మింటన్ ఆటగాడు, కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో సుధీర్ నటించనున్నాడు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు నటించనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు షికారు చేశాయి కానీ అది కార్యరూపం దాల్చలేదు. సుధీర్ బాబు సుదీర్ఘ కల ఇది.

సుధీర్ బాబు మంచి బాడ్మింటన్ ప్లేయర్ .. అంతేకాదు ఆయన పుల్లెల గోపీచంద్ కి స్నేహితుడు కూడా.అందువలన ఆయన బయోపిక్ లో నటించడానికి చాలాకాలంగా ఉత్సాహాన్ని చూపుతూ వచ్చాడు. అందుకు సంబంధించిన పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయని అంటున్నారు

Sudheer babu planing a Bio Pic on badminton player gopichand..

తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి సుధీర్ బాబు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకి గల అడ్డంకులన్నీ తొలగిపోయాయట. ఇటీవల 'గుంటూర్ టాకీస్' చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా సుధీర్ కలల చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చలు చివరి దశలో ఉన్నాయి.

అంతే కాదు బయోపిక్ ల హవా బాగానే ఉన్న బాలీవుడ్ లోనూ ఈ సినిమాని మార్కెట్ చేయనున్నారట. అందుకోసం అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థలతో సుధీర్ అండ్ కో మంతనాలు జరుపుతున్నారు. 'బాఘీ' సినిమాతో బాలీవుడ్ బాటపట్టిన సుధీర్ నటుడిగా మంచి మార్కులే తెచ్చకోవడంతో అక్కడా ఇతగాడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం.

2014లో విడుదలైన తమిళ కామెడీ సినిమా 'ముందాసుపట్టి' హిందీ రీమేక్‌లో సుధీర్ నటించనున్నాడట. 1980లో జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ లేదా జులైలో సెట్స్‌ మీదికెళ్ళనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. చూస్తుంటే సుధీర్ కెరీర్ గాడినపడ్డట్టే ఉంది. అన్నట్టు సుధీర్ కూడా మంచి బాడ్మింటన్ ప్లేయరే.

English summary
Sudheer babu playing a role as badminton player Pullela gopichand
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu