»   » మహేష్ బావ సైతం ఓ తమిళ రీమేక్ తో సిద్దం

మహేష్ బావ సైతం ఓ తమిళ రీమేక్ తో సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు బావ సుధీర్ బాబు కు ప్రేమ కధా చిత్రం తప్పించి అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయితే యావరేజ్ సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్న అతనికి ఈ మధ్యకాలంలో హిందీలో చేసిన బాఘీ చిత్రం కాస్త ఊపు ఇచ్చింది. చేసింది విలన్ పాత్ర అయినా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.

తెలుగులో ఇంతకాలంగా చేస్తున్నా ఎవరూ మాట్లాడుకోలేదు కానీ ఈ హిందీ చిత్రంలో అతని పాత్ర గురించి, అతని జిమ్ బాడీ గురించి అంతా ఓ స్దాయిలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చర్చించారు. ఈ నేపధ్యంలో ఓ డిఫరెంట్ సినిమాతో తెలుగులో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడట.

తెలుగు దర్సకులు తెచ్చే కథల కన్నా తమిళంలో వచ్చి హిట్టైన ఓ రీమేక్ తో అయితే మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్మి ముందుకు వెల్తున్నట్లు సమాచారం. తమిళంలో వచ్చిన ముందాసుపట్టి చిత్రం రీమేక్ తో ఆయన మనల్ని నవ్వించనున్నారు.

Sudheer Babu remaking Tamil Super hit

2014లో విడుదలైన ముందాసు పట్టి చిత్రంలో విష్ణు, నందిత హీరో,హీరోయిన్స్ గా చేసారు. తమిళంలో మంచి విజయం సాధించిందీ చిత్రం. ఈ సినిమాలో ఓ ఫిక్షన్ లిలేజ్ లో 1980లలో జరుగుతూంటుంది. ఆ విలేజ్ లో జనంకు ఓ భయం ఉంటుంది. అక్కడ వారికి ఫొటోలు తీసుకుంటే చెడు జరుగుతుందని నమ్మకం. ఈ పాయింట్ చుట్టూ కథ జరుగుతంది. త్వరలో ఈ రీమేక్ ప్రారంభం కానుంది.

సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ...''బాఘీలో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అవకాశాలూ వస్తున్నాయి. తెలుగులోనూ విలన్‌గా నటించడానికి నేను సిద్ధమే'' అన్నారు.

అలాగే త్వరలోనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో సుధీర్‌ హీరోగా నటించనున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ ''నేను బాడ్మింటన్‌ క్రీడాకారుణ్ని. కాబట్టి గోపీచంద్‌ పాత్రలో నటించడం నాకు సులభమే.

పైగా పుల్లెల గోపీచంద్‌ జీవితాన్ని దగ్గర్నుంచి చూశా. ఆయన వ్యక్తిత్వం, జీవిత ప్రయాణం బాగా తెలుసు. 'భలే మంచి రోజు'కు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీరాంరెడ్డి ఓ కథ చెప్పారు. అది బాగా నచ్చింది. త్వరలోనే దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తామ''అన్నారు.

English summary
Hero Sudheer Babu is going to remake successful Tamil comedy Mundasupatti in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu