»   » సిక్స్ ప్యాక్ తో కామెడీ సిక్సర్ ('ఆడు మగాడ్రా బుజ్జీ' ప్రివ్యూ)

సిక్స్ ప్యాక్ తో కామెడీ సిక్సర్ ('ఆడు మగాడ్రా బుజ్జీ' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ప్రేమకథాచిత్రమ్‌'తో తొలి విజయాన్ని అందుకొన్న సుధీర్‌బాబు తాజా చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. గంగదాసు కృష్ణారెడ్డి దర్శకుడు దా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హిట్ తర్వాత తన నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఆడు మగాడ్రా బుజ్జి'పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయనీ, దాంతో ఈ సినిమా విడుదలవుతుందంటే కాస్త నెర్వస్‌గానే ఉందనీ అంటున్నారు సుధీర్‌బాబు.

కథ ఏమిటంటే..కాలేజీలో అందమైన అమ్మాయిని అస్మిత. అయితే ఆమె వైపు చూడటానికి అబ్బాయిలు భయపడుతుంటారు. దానికి కారణం ఆమె అన్నయ్య( రణ్‌ధీర్). అతను కాలేజీలో డాన్‌. అయితే సిద్దు(సుధీర్‌) మాత్రం ఆమె కోసమే కాలేజీకొస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే దాని వెనుక మాత్రం పెద్ద కారణముంటుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చుంటాయి. వాటిలో ఇది భిన్నంగా ఉంటుంది.


హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... దర్శకుడు కృష్ణారెడ్డి నాకు కథ ఎలా చెప్పాడో, అలాగే తీశాడు. రాజమౌళి శిష్యుడైనా ఆ ప్రభావం ఏమీ లేకుండా, ఎవర్నీ కాపీ కొట్టకుండా చాలా బాగా తీశాడు. కథలోని మలుపుకు కారణమయ్యే కీలక పాత్రను పూనమ్ కౌర్ చేసింది. హీరోయిన్‌గా అందమైన అమ్మాయి కావాలి. అస్మితా సూద్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. విలన్‌గా చేసిన అజయ్‌ది ఇందులో స్ట్రాంగ్ క్యారెక్టర్. రాజకీయ నాయకుడు కావాలని తపించే శంకరన్న అలియాస్ బుజ్జిగా చాలా బాగా నటించాడు. ఇక ఇందులోని ఓ కుక్క పాత్ర గురించీ చెప్పుకోవాలి. దానికి ఈ సినిమాలో చాలా కష్టాలొస్తాయి. దానికీ, నాకూ మధ్య సంభాషణలు ఉంటాయి. ఆ కుక్క కూడా కామెడీ పంచుతుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ఇది యాక్షన్ మేళవించిన పూర్తి స్థాయి కామెడీ సినిమా. హీరో క్యారెక్టరైజేషన్ బాగా వచ్చింది. కొత్తగా అనిపిస్తుంది. అనుకున్నది ఏదైనా సాధించేవాడే మగాడు. 'అతడు'లో మహేశ్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. దాని తరహాలోనే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది అన్నారు.

బ్యానర్ :కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: సుధీర్ బాబు, అస్మిత, సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు
సంగీతం: శ్రీ,
కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్,
కెమెరా: శాంటోనియో ట్రిజియో,
మాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ,
పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్,
నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary
Aadu Magadura Bujji, featuring yesteryear’s super star Krishna’s son-in-law Sudheer Babu, will be arriving today with his latest Aadu Magadura Bujji. Directed by Gangadasu Krishna Reddy, Aadu Magadura Bujji has Asmita Sood and Poonam Kaur as heroines. The film has music by Sri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu