»   » అదరకొడుతున్న 'ఆడు మగాడ్రా బుజ్జి' (ఆన్ లొకేషన్ స్టిల్స్)

అదరకొడుతున్న 'ఆడు మగాడ్రా బుజ్జి' (ఆన్ లొకేషన్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ, మహేష్‌బాబు నటించిన 'అతడు' చిత్రంలోని డైలాగునే ఈ సినిమాకు పేరుగా పెట్టడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం సరికొత్తగా ఉంటుందని, సీనియర్ ఆర్టిస్టులతో నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. వచ్చే నెలలో పాటలను చిత్రీకరిస్తామని, అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు కృష్ణారెడ్డి గంగదాసు తెలిపారు.

యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్న ఈ సినిమాలోని పాటలను సెప్టెంబర్‌లో యూరప్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. కుటుంబ విలువలతో అందరికీ నచ్చేలా చిత్రం రూపొందుతుందని సుమన్, నరేష్ తెలిపారు. అస్మితా సూద్, సంధ్యా జనక్, లక్ష్మి, రణధీర్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీ, కెమెరా:శాంటోనియో ట్రె జియో, ఆర్‌ట:నారాయణరెడ్డి, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

మిగతా విశేషాలు... స్లైడ్ షోలో...

దర్సకుడుగా పరిచయం...

దర్సకుడుగా పరిచయం...

సుధీర్‌బాబు హీరోగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'ఆడు మగాడ్రా బుజ్జీ' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. పూనమ్ కౌర్, అస్మితాసూద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో కృష్ణారెడ్డి గంగదాసు దర్శకునిగా పరిచయమవుతున్నారు.

నిర్మాతలు సుబ్బారెడ్డి మాట్లాడుతూ .....

నిర్మాతలు సుబ్బారెడ్డి మాట్లాడుతూ .....

'ఈ పాట తరువాత హైదరాబాద్‌లోనే మరో పాటను కూడా హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తాం. మిగిలిన నాలుగు పాటల్ని మలేషియాలో చిత్రీకరిస్తాం. యూత్‌నీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకొనే సినిమా ఇది. ఈ నెల చివరివారంలో పాటలను విడుదల చేస్తాం' అని తెలిపారు.

మాటలోంచి పేరు...

మాటలోంచి పేరు...

పాటల్లోంచి సినిమా పేర్లు పుట్టడం సాధారణమే.. కానీ మాటల్లోంచి పుట్టడం కాస్త కొత్తే. అలా పేరుపెట్టుకున్న సినిమానే 'ఆడు మగాడ్రా బుజ్జి'. సుధీర్‌బాబు హీరో. పూనమ్‌కౌర్‌, అస్మితాసూద్‌ హీరోయిన్స్ . కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. సుబ్బారెడ్డి, ఎస్‌.ఎన్‌.రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది.

మంచి స్పందన వచ్చింది..

మంచి స్పందన వచ్చింది..

‘‘ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కి చక్కటి స్పందన వచ్చింది. టైటిల్‌ ఎలా ఉందో సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. టాకీపార్ట్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం ఓ పాటను సి.ఎం.ఆర్‌. కాలేజ్‌లో చిత్రీకరిస్తున్నాం. సుధీర్‌బాబు డ్యాన్స్‌, పెర్‌ఫార్మెన్స్‌, ఫైట్స్‌కి మంచి స్కోపున్న క్యారెక్టర్‌ చేస్తున్నాడు'' అన్నారు.

మరో నిర్మాత ఎస్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ....

మరో నిర్మాత ఎస్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ....

‘‘నటీనటులపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. మరోపాటను కూడా హైదరాబాద్‌లోనే తెరకెక్కిస్తాం. మిగిలిన నాలుగు పాటల్ని మలేషియాలో చిత్రీకరిస్తాం. అవుట్‌పుట్‌ బాగా వస్తోంది. సుధీర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే చిత్రమిది. ఈ నెల చివరి వారంలో పాటల్ని విడుదల చేస్తాం'' అన్నారు.

డైరక్టర్ మాట్లాడుతూ...

డైరక్టర్ మాట్లాడుతూ...

'' హీరోని ఆడు మగాడ్రా బుజ్జీ అని ఎవరన్నారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శ్రీధర్‌ రెడ్డి నేతృత్వంలో 'అడెడె తొలిప్రేమ... ఇదినీ మహిమేనా.. ' అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నాము''అని తెలిపారు. '

మలేషియాలోనూ...

మలేషియాలోనూ...

'వినోదాత్మకంగా సాగే చిత్రమిది. సుధీర్‌బాబు పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. త్వరలో మలేషియాలో పాటల చిత్రీకరణ జరుపుతాం. తర్వాత పాటల్ని విడుదల చేస్తాము.

అందరికీ నచ్చేలా..

అందరికీ నచ్చేలా..

కుటుంబ విలువలతో అందరికీ నచ్చేలా చిత్రం రూపొందుతుందని సుమన్, నరేష్ తెలిపారు. వీరిద్దరి పాత్రలూ సినిమాలో కీలకమని తెలుస్తోంది.

ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా..

ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా..

ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడవనుందని తెలుస్తోంది. కొద్దిపాటి యాక్షన్, పూర్తి స్ధాయి ఫన్, రొమాన్స్ తో చిత్రం జనరంజకంగా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 20 నుంచి మలేషియాలో పాటల చీత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నాం.

సి.ఎం.ఆర్‌.కళాశాలలో ...

సి.ఎం.ఆర్‌.కళాశాలలో ...


ప్రస్తుతం హైదరాబాద్... కొంపల్లి సి.ఎం.ఆర్‌.కళాశాలలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పూర్తయ్యాక యూరప్ లోనూ మిగతా పాటలు షూటింగ్ ఉండనుందని తెలుస్తోంది.

హీరో పాత్ర ...

హీరో పాత్ర ...

సినిమాలో హీరో సుధీర్ బాబు పాత్ర చాలా సరదాగా ఉంటుందని, తండ్రి,కొడుకుల మద్య రిలేషన్ సీన్స్, ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఆ సీన్స్ కు కనెక్టు అవుతారని చెప్తున్నారు. సుధీర్‌బాబును కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఈ చిత్రంతో ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడుతుంది'

ఎవరెవరు...

ఎవరెవరు...

సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి'. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూనమ్‌కౌర్‌, అస్మితాసూద్‌ నాయికలు. కలర్స్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుబ్బారెడ్డి-ఎస్‌.ఎన్‌.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాకీపార్ట్‌ మొత్తం పూర్తయింది. సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్.

English summary
Mahesh Babu’s B-I-L Sudheer Babu who scored a hit with Prema katha chitram is busy wrapping up his new movie ‘Aadu magadu raa bujji’. Sudheer Babu who is gearing up for ‘Aadu Magadu raa Bujji’ says that, the movie which derives it’s title from Athadu movie’s popular dialogue will stand up to the expectations. The shooting of talkie part has been complete and unit is busy in songs picturisation. Audio will be released in September last week. He is pared up with Asmita Sood for this entertaining movie. Rajamouli’s assistant Gangadasu Krishna Reddy is directing the movie. Subba Reddy and SN Reddy are producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu